Jubilee Hills by-election: ఓటింగ్‌కు వేళాయె.. జూబ్లీ ఫైట్ ఈరోజే..
ABN, Publish Date - Nov 11 , 2025 | 06:38 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కోసం అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కానుండడంతో సోమవారం సాయంత్రమే ఈవీఎం, వీవీప్యాట్‌లను సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలించారు.
- పోలింగ్ కేంద్రాలకు తరలిన ఈవీఎంలు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills by-election) పోలింగ్ కోసం అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కానుండడంతో సోమవారం సాయంత్రమే ఈవీఎం, వీవీప్యాట్‌లను సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద జీహెచ్‌ఎంసి సిబ్బంది పారిశుధ్య పనులు పూర్తి చేశారు. ఓటర్లకు కల్పించే వసతులను ఉన్నతాధికారులు పరిశీలించారు. రెండు ప్రాంతాల్లో బాత్‌రూంలు సరిగ్గా లేకపోవడంతో వెంటనే మరమ్మతులు చేయించారు. పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల దూరం వరకు సున్నపు గీతలు పెట్టారు. యూసు్‌ఫగూడ కోట్ల విజయభాస్కర్‌రెడ్డిలోని డీఆర్‌సీ సెంటర్ నుంచి బీఎల్‌ఓలు ఇతర సిబ్బందికి ఈవీఎం, వీవీప్యాట్‌లను రిటర్నింగ్ అధికారి అందచేశారు.
నియోజక వర్గ వివరాలు...
మొత్తం ఓటర్లు 4,01,635
పురుషులు 2,08,561
మహిళలు 1,92,779
ఇతరులు 25
పోలింగ్ కేంద్రాలు 407
సిబ్బంది 2,060
సమస్యాత్మక కేంద్రాలు 226
పోలీస్ సిబ్బంది 2,000
రిజర్వ్‌తో కలుపుకొని 2,394
మొత్తం బ్యాలెట్ యూనిట్లు
కంట్రోల్ యూనిట్లు 561
వీవీ ప్యాట్ యంత్రాలు 595
ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు 58
ఈ వార్తలు కూడా చదవండి..
మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
10 పరీక్షల ఫీజు చెల్లింపునకు 25 వరకు గడువు
సీఎం, డిప్యూటీ సీఎంలపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్టు
Read Latest Telangana News and National News
Updated Date - Nov 11 , 2025 | 07:01 AM