Share News

Obscene Comments: సీఎం, డిప్యూటీ సీఎంలపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్టు

ABN , Publish Date - Nov 11 , 2025 | 06:13 AM

సోషల్‌మీడిమాలొ సీఎం చంద్రబాబు, డిప్యూటీసీఎం పవన్‌ కల్యాణ్‌తో పాటు ఇతరులపై అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకర పోస్టులను...

 Obscene Comments: సీఎం, డిప్యూటీ సీఎంలపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్టు

గుంటూరు కార్పొరేషన్‌, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): సోషల్‌మీడిమాలొ సీఎం చంద్రబాబు, డిప్యూటీసీఎం పవన్‌ కల్యాణ్‌తో పాటు ఇతరులపై అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకర పోస్టులను పెట్టిన వ్యక్తిని గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు ఈస్ట్‌ డీఎస్పీ షేక్‌ అబ్దుల్‌ అజీజ్‌ ఆ వివరాలను సోమవారం తెలిపారు. ‘గాలి సతీష్‌ బాబు అనే వ్యక్తి తన ఎక్స్‌లో అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేశారు. దీనిపై వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఏడాది సెప్టెంబరు 7న కేసు నమోదు చేశాం. నిందితుడు గాలి సతీశ్‌ బాబును సోమవారం అరెస్ట్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నాం’ అని తెలిపారు.

Updated Date - Nov 11 , 2025 | 06:13 AM