ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

JNTU: జేఎన్‌టీయూ అనుబంధ కాలేజీల్లో ఐదుగురు ఆచార్యులకు స్థానచలనం

ABN, Publish Date - Oct 14 , 2025 | 07:44 AM

జేఎన్‌టీయూకు అనుబంధంగా ఉన్న మూడు ఇంజనీరింగ్‌ కాలేజీల ప్రిన్సిపాల్స్‌తో పాటు పలువురు ఆచార్యులను బదిలీ చేస్తూ వర్సిటీ రిజిస్ట్రార్‌ వెంకటేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం

హైదరాబాద్‌ సిటీ: జేఎన్‌టీయూ(JNTU)కు అనుబంధంగా ఉన్న మూడు ఇంజనీరింగ్‌ కాలేజీల ప్రిన్సిపాల్స్‌తో పాటు పలువురు ఆచార్యులను బదిలీ చేస్తూ వర్సిటీ రిజిస్ట్రార్‌ వెంకటేశ్వరరావు(University Registrar Venkateswara Rao) ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జగిత్యాల జేఎన్‌టీయూ కాలేజీ ప్రిన్సిపాల్‌గా ఉన్న విశ్వనాథరాజును సుల్తాన్‌పూర్‌ జేఎన్‌టీయూ కాలేజీ ప్రిన్సిపాల్‌గా నియమించారు. అక్కడ పనిచేస్తున్న నర్సింహను జగిత్యాల కాలేజీ ప్రిన్సిపాల్‌గా బదిలీ చేశారు.

హైదరాబాద్‌ క్యాంపస్‌ కాలేజీ(Hyderabad Campus College)లో సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ వెంకటేశ్వరరెడ్డిని పాలేరు జేఎన్‌టీయూ కాలేజీ ప్రిన్సిపాల్‌గా నియమించగా, అక్కడ ప్రిన్సిపాల్‌ పోస్టులో ఉన్న రమేశ్‌(Ramesh)ను బాధ్యతల నుంచి రిలీవ్‌ చేసి కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాధిపతిగా నియమించారు. మరోవైపు జగిత్యాల జేఎన్‌టీయూ కాలేజీలో కంప్యూటర్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శ్వేతను, అనారోగ్య కారణాల రీత్యా సుల్తాన్‌పూర్‌ కాలేజీకి బదిలీ చేసినట్లు రిజిస్ట్రార్‌ జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

దేవుడా.. చుక్కలనంటుతున్న పసిడి ధరలు

వెంకటేష్‌ నాయుడి ఫోన్‌ అన్‌లాక్‌కు అనుమతి

Read Latest Telangana News and National News

Updated Date - Oct 14 , 2025 | 07:44 AM