JNTU: రీసెర్చ్ సెంటర్లకు రైట్ రైట్..
ABN, Publish Date - Nov 15 , 2025 | 10:25 AM
ప్రైవేటు కాలేజీల్లోని రీసెర్చ్ కేంద్రాల్లో పరిశోధనలకు అనుమతిస్తున్నట్లు జేఎన్‌టీయూ వైస్‌చాన్స్‌లర్ టి.కిషన్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం వర్సిటీ ప్రాంగణంలోని నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం, కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు, ఆచార్యులతో వీసీ మాట్లాడారు.
- ప్రైవేటు కాలేజీల్లోనూ పరిశోధనలకు జేఎన్‌టీయూ పచ్చజెండా
- పదోన్నతులకు అర్హులైన ఆచార్యులకు 24 నుంచి సీఏఎస్ ఇంటర్వ్యూలు
- నెహ్రూ జయంతి వేడుకలో జేఎన్‌టీయూ వీసీ టీకేకే రెడ్డి
హైదరాబాద్ సిటీ: ప్రైవేటు కాలేజీల్లోని రీసెర్చ్ కేంద్రాల్లో పరిశోధనలకు అనుమతిస్తున్నట్లు జేఎన్‌టీయూ వైస్‌చాన్స్‌లర్ టి.కిషన్‌కుమార్ రెడ్డి(Vice Chancellor T. Kishankumar Reddy) ప్రకటించారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం వర్సిటీ ప్రాంగణంలోని నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం, కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు, ఆచార్యులతో వీసీ మాట్లాడారు.
ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలను ఆచార్యులు వీసీ దృష్టికి తీసుకురాగా, అప్పటికప్పుడు ఆయన పరిష్కార మార్గాలను సూచించారు. ప్రైవేటు కాలేజీల్లోని రీసెర్చ్ కేంద్రాల్లో తనిఖీలు పూర్తయినందున, ఎంపిక చేసిన కాలేజీల్లో అర్హులైన ప్రిన్సిపాల్స్ లేదా ప్రొఫెసర్లు కనీసం ఇద్దరు స్కాలర్స్‌కు గైడ్ చేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. వివిధ పరిశోధన సంస్థల నుంచి సుమారు 200 రీసెర్చ్ ఐడియాలను స్వీకరించామని,
అందులో ఎంపిక చేసిన అంశాలపై పరిశోధనలను ల్యాబొరేటరీ నుంచి సమాజానికి ఉపయోగపడే వరకు (ట్రాన్స్‌లేషనల్ రీసెర్చ్) జరిపించాలని భావిస్తున్నట్లు వీసీ పేర్కొన్నారు. అలాగే, పదోన్నతులకు అర్హులైన ఆచార్యుల కోసం ఈ నెల 24నుంచి కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ (స్కీమ్) కింద ఇంటర్వ్యూలను ప్రారంభిస్తామన్నారు. నెహ్రూ జయంతి కార్యక్రమంలో రెక్టార్ విజయ కుమార్ రెడ్డి, రిజిస్ర్టార్ వెంకటేశ్వరరావు, పలువురు డైరెక్టర్లు, విభాగాధిపతులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..
పది పరీక్షలకు 100 రోజుల ప్రణాళిక
Read Latest Telangana News and National News
Updated Date - Nov 15 , 2025 | 10:25 AM