ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: పాఠశాలలు ప్రారంభమైన రోజు నుంచే.. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు

ABN, Publish Date - May 22 , 2025 | 10:19 AM

మరికొద్దిరోజుల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. అయితే.. పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

- పాఠశాలలు ప్రారంభమైన రోజు నుంచే పంపిణీకి ఏర్పాట్లు

- 70 శాతం రాక.. 30 శాతం జూన్‌లోపు..

- పాఠశాలల పునః ప్రారంభం అదే నెల 12న

హైదరాబాద్: సర్కార్‌ బడుల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం యేటా ఉచితంగా పాఠ్యపుస్తకాలను పంపిణీ చేస్తుంది. ఈ యేడు కూడా పాఠశాలలు పునః ప్రారంభమైన రోజు నుంచే పంపిణీ చేయాలని భావిస్తోంది. మల్కాజిగిరి(Malkajgiri) నియోజకవర్గంలో అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించారు. మండల విద్యా కేంద్రానికి చేరుకున్న పాఠ్యపుస్తకాలను జూన్‌ 2 నుంచి పాఠశాలలకు తరలించాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ జూన్‌ 10లోపు పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా పాఠశాలలు జూన్‌ 12న పునఃప్రారంభం కానున్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad సెల్‌టవర్‌ ఎక్కి వ్యక్తి హల్‌చల్‌..


- నాలుగు నెలల తర్వాత పార్ట్‌ 2....

2024-25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి యూడైస్+లో జనవరి వరకు నమోదైన విద్యార్థుల సంఖ్య ఆధారంగా సరఫరా ప్రక్రియ ప్రారంభించారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో అల్వాల్‌, మల్కాజిగిరి మండలం పరిధిలో 50 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. 10 వేల మంది చదువుతున్నారు. ఇప్పటి వరకు 70 శాతం పాఠ్యపుస్తకాలు రాగా, మరో 30 శాతం పుస్తకాలు జూన్‌లోగా రానున్నాయి. మొదటి విడత కింద తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ పుస్తకాలను పూర్తిస్థాయిలో అందజేయనున్నారు.


గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రం పుస్తకాలు (ద్విభాష పద్ధతి) పార్ట్‌-1 మాత్రమే అందించనున్నారు. ఆయా పుస్తకాల్లో పేజీకి ఇరువైపులా తెలుగు, ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో అంశాలు ప్రచురితమై ఉంటాయి. భాషా పుస్తకాలను మినహాయిస్తే విద్యా సంవత్సరం అరంభంలో పార్ట్‌-1 అందించనున్నారు. ఎస్‌ఏ-1 పరీక్షలు పూర్తయితే సెప్టెంబర్‌లో లేదా అక్టోబర్‌లో పార్ట్‌-2 పంపిణీ చేయనున్నారు.


పది రోజుల్లో బుక్స్‌ వస్తాయి

పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజు నుంచే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేస్తాం. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆయా పాఠ్య పుస్తకాలను తరలించేందుకు ఏర్పాట్లు చేశాం. పాఠశాలలు ప్రారంభానికి ముందే ఈ ప్రక్రియను పూర్తి చేస్తాం. ఇప్పటి వరకు 70 శాతం పాఠ్యపుస్తకాలు రాగా, మరో 30 శాతం పుస్తకాలు రావాల్సి ఉంది. మరో వారం, పది రోజుల్లో పూర్తిస్థాయిలో రానున్నాయి. పాఠ్యపుస్తకాల్లో ప్రతీపాఠానికి బార్‌ కోడ్‌ ముద్రించారు. సెల్‌ఫోన్‌ ద్వారా స్కాన్‌ చేస్తే ఆ పాఠాన్ని దృశ్య రూపంలో వీక్షించవచ్చు.

-మురళీకృష్ణ, అల్వాల్‌ ఎంఈవో


ఈ వార్తలు కూడా చదవండి.

Gold Rates Today: భారీ షాక్ ఇచ్చిన బంగారం, వెండి ధరలు.. చివరకు..

Kaleshwaram: కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతు ప్రణాళికలేవి

BJP National President K Laxman: వ్యవస్థలో మార్పే అసలైన పరీక్ష

Asaduddin Owaisi: వక్ఫ్‌ చట్టాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే

Kaleshwaram Pushkaralu: భక్తజన సంద్రం.. త్రివేణీ సంగమం

Read Latest Telangana News and National News


Updated Date - May 22 , 2025 | 10:19 AM