Share News

Kaleshwaram: కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతు ప్రణాళికలేవి

ABN , Publish Date - May 22 , 2025 | 07:01 AM

కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించి నిర్మాణ సంస్థలు తక్షణ మరమ్మతు ప్రణాళికలు అందించడంలో విఫలమయ్యాయి. ఈ ఎన్‌సీ అధికారులు గురువారం బ్యారేజీలను సందర్శించి రక్షణ చర్యలపై ఆదేశాలు ఇవ్వనున్నారు.

Kaleshwaram: కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతు ప్రణాళికలేవి

  • నిర్ణీత గడువులోగా అందించ ని నిర్మాణ సంస్థలు

  • నేడు బ్యారేజీలను సందర్శించనున్న ఈఎన్‌సీ

హైదరాబాద్‌, మే 21(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి తక్షణ మరమ్మతు ప్రణాళికలను అందజేయడంలో నిర్మాణ సంస్థలు చేతులెత్తేశాయి. వానాకాలంలో బ్యారేజీల రక్షణకు ఏమేం చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రణాళికలు అందించాలని ఎల్‌ అండ్‌ టీ (మేడిగడ్డ), అఫ్కాన్స్‌(అన్నారం), నవయుగ(సుందిళ్ల) సంస్థలను ప్రభుత్వం కోరింది. ఈ నెల 21(బుధవారం) నాటికల్లా ప్రణాళికలు అందిస్తే.. వాటి ఆధారంగా ముందుకెళ్తామని సూచించింది. అయితే, ఈ అంశంపై నిర్మాణ సంస్థల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. మరోవైపు ఈ సారి ముందస్తుగా రుతుపవనాలు రానున్నాయనే సంకేతాల నేపథ్యంలో మూడు బ్యారేజీల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ(జనరల్‌) అనిల్‌కుమార్‌ సహా ఇతర అధికారులు గురువారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు/పం్‌పహౌ్‌సలను పరిశీలించనున్నారు. వానాకాలంలోపు ప్రాథమికంగా ఏమేం చర్యలు తీసుకోవాలనే దానిపై క్షేత్రస్థాయిలో అధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నారు.

Updated Date - May 22 , 2025 | 07:03 AM