Share News

Gold Rates Today: భారీ షాక్ ఇచ్చిన బంగారం, వెండి ధరలు.. చివరకు..

ABN , Publish Date - May 22 , 2025 | 06:43 AM

దేశంలో ఈరోజు బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి షాకింగ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ఈరోజు (gold rates today may 22nd 2025) ఉదయం నాటికి బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఎంతలా అంటే దాదాపు రెండు వేల రూపాయలు పెరగడం విశేషం.

Gold Rates Today: భారీ షాక్ ఇచ్చిన బంగారం, వెండి ధరలు.. చివరకు..
GoldRateIncrease

దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలోనే మే 22, 2025న ఉదయం నాటికి బంగారం, వెండి ధరలు భారీగా పెరిగి, బిగ్ షాక్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఈరోజు (gold rates today may 22nd 2025) ఉదయం 6.30 గంటల సమయానికి హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 1900 పుంజుకుని రూ. 97,430కి చేరింది. 22 క్యారెట్ పసిడి ధర 10 గ్రాములకు రూ. 1750 పెరిగి రూ. 89,310కి చేరుకుంది. ఇదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేటు రూ. 97,580కి చేరుకోగా, 22 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 89,460కు చేరింది.


ఈరోజు వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారంతో పాటు, వెండి ధరలు కూడా ఈ రోజు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో ఢిల్లీలో వెండి ధర కిలోకు రూ. 2000 పెరిగి, రూ. 100100కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్, వరంగల్, తిరుపతి, విజయవాడలో కిలో వెండి ధర రూ.2100 పెరిగి రూ.111,100కు చేరుకుంది. ఈ నేపథ్యంలో చెన్నై, కేరళ ప్రాంతాల్లో కూడా వెండి ధరలు రూ.111,100గా ఉన్నాయి. మరోవైపు నోయిడా, నాసిక్, మైసూర్, సూరత్, నాగ్ పూర్, పాట్నా, జైపూర్, ముంబై ప్రాంతాల్లో వెండి రేట్లు రూ. 100100కు చేరాయి.


ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

ఈ క్రమంలో చెన్నైలో 22 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 89,310 కాగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములకు రూ. 97,430గా ఉంది. ముంబైలో బంగారం ధరలు చెన్నైతో సమానంగా ఉన్నాయి. 22 క్యారెట్ బంగారం ధర ఒక గ్రాముకు రూ. 8930గా ఉండగా, 24 క్యారెట్ రూ. 9743గా కలదు. ఢిల్లీలో 22 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 8,9460 ఉండగా, 24 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 97,580కి చేరుకుంది. బెంగళూరు, హైదరాబాద్, కేరళ, పూణే, వడోదరలో 22 క్యారెట్ 24 క్యారెట్ బంగారం ధరలు వరుసగా 10 గ్రాములకు రూ. 89,310, రూ. 97,430 స్థాయిలో ఉన్నాయి.


ఈ వారం బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు ఈ వారం అస్థిరంగా ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే డాలర్ ఇండెక్స్‌లో హెచ్చుతగ్గులు, రష్యా-ఉక్రెయిన్ ఒప్పందం వంటి పలు కారణాలతో వీటిలో మార్పు రావచ్చని అంటున్నారు. ఈ క్రమంలో బంగారం ధరలు ఔన్స్‌కు $3,120 వద్ద సపోర్ట్ స్థాయిని కలిగి ఉండవచ్చని, వెండి ధరలు కూడా $31.40 స్థాయికి చేరుకోవచ్చని ఆయా వర్గాలు చెబుతున్నాయి.


ఇవీ చదవండి:

Loan Apps: యాప్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..

Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు


Bengaluru Roads: రోడ్ల అధ్వాన స్థితిపై రూ.50 లక్షల పరిహారం కోరుతూ లీగల్ నోటీస్..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 22 , 2025 | 07:04 AM