Margasira Purnima: ఇంతకీ మార్గశిర పౌర్ణమి ఎప్పుడు.. ఆ రోజు ఇలా చేస్తే..
ABN, Publish Date - Dec 01 , 2025 | 01:38 PM
మాసాల్లో మార్గశిరాన్ని నేనంటూ గీతాచార్యుడు శ్రీకృష్ణుడు చెప్పారు. కార్తీక మాసానికి ఎంతటి విశిష్టత ఉందో.. మార్గశిరానికి సైతం అంతే విశిష్టత ఉంది. అలాంటి మార్గశిర మాసంలో గురువారానికి ఒక ప్రత్యేకత ఉంది.
మాఘమాసంలో ఆదివారం.. శ్రావణమాసంలో శుక్రవారం.. కార్తీకమాసంలో సోమవారం.. మార్గశిరమాసంలో గురువారం.. అత్యంత పవిత్రమైన రోజులుగా భక్తులు భావిస్తారు. ఈ మాసాల్లో ఆయా రోజుల్లో భక్తుల నుంచి దేవ దేవుళ్లు పూజలందుకుంటారు. మార్గశిర మాసం గురువారం శ్రీ మహాలక్ష్మీకి ప్రతి రూపమైన శ్రీకనక మహాలక్ష్మీని భక్తులు భక్తితో ఆరాధిస్తారు. ఈ మార్గశిర మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు.. గురువారంతోపాటు పౌర్ణమి సైతం వచ్చింది. ఈ రోజు రాత్రి మహాలక్ష్మీ, చంద్రుడిని పూజిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. అదీకాక ఈ పౌర్ణమి రోజు.. రవి కలయిక ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ రోజు ఉదయం స్నానం చేసి పూజ చేయడం.. ఉపవాసం ఉండడం, దానం చేయడం చాలా ముఖ్యమని అంటున్నారు.
పౌర్ణమి తిధి ఎప్పుడంటే..
పంచాంగం ప్రకారం.. పౌర్ణమి తిథి డిసెంబర్ 04వ తేదీ గురువారం ఉదయం 8.37 గంటలకు ప్రారంభమవుతుంది. డిసెంబర్ 05వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 4.43 గంటలకు ఈ తిథి వెళ్లిపోనుంది. అంటే డిసెంబర్ 4వ తేదీ మార్గశిర పౌర్ణమి వచ్చింది. ఈ రోజు ఉదయం 6.59 గంటల నుంచి మధ్యాహ్నం 2.54 గంటల వరకు రవి యోగం ఉంటుంది. ఈ యోగంలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని చెబుతారు.
ఈ రోజు ముహూర్తం..
బ్రహ్మ ముహూర్తం: ఉదయం 5.10 నుంచి ఉదయం 6.04 గంటల వరకు ఉంటుంది.
అభిజిత్ ముహూర్తం: ఉదయం 11.50 నుంచి మధ్యాహ్నం 12.32 గంటల వరకు ఉంటుంది.
పౌర్ణమి రోజు చంద్రోదయ సమయం సాయంత్రం 4.35 గంటలకు ప్రారంభమవుతుంది.
ఈ రోజు రాహు కాలం: మధ్యాహ్నం 1.30 నుంచి 3.00 గంటల వరకు ఉంటుంది.
పౌర్ణమి రోజు ప్రదోష కాలంలో లక్ష్మీదేవిని పూజిస్తారు.
ఈ పౌర్ణమి వేళ.. ఇలా చేస్తే..
మార్గశిర పౌర్ణమి నాడు దానం చేయడం, లక్ష్మీదేవిని పూజించడం వల్ల బాగా కలిసి వస్తుందంటారు. సంతోషం, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని చెబుతారు. చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా, చంద్ర దోషం తగ్గుతుందంటారు.
ఈ రోజు.. ఈ వ్రతం..
ఈ రోజు ఇంట్లో కానీ, దేవాలయంలో కానీ శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించినా... ఈ కథ విన్నా శుభ ఫలితాలు ఇస్తుందంటారు.
ఈ మంత్రాలు..
ఈ రోజు.. ఓం శ్రీమహాలక్ష్మీై నమ:, ఓం సోమాయ నమ: అనే మంత్రాలు పటిస్తే విశేష లాభం ఉంటుందని పండితులు చెబుతారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జాక్‌పాట్ కొట్టనున్న ఈ రాశులు.. పట్టిందల్లా బంగారమే..!
For More Devotional News And Telugu News
Updated Date - Dec 01 , 2025 | 01:41 PM