Zodiac Signs: జాక్‌పాట్ కొట్టనున్న ఈ రాశులు.. పట్టిందల్లా బంగారమే..!
ABN , Publish Date - Nov 28 , 2025 | 04:15 PM
జోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు, బుధుడి ప్రభావం చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. ఈ రెండింటి కలయిక.. బుధాదిత్య యోగాన్ని కల్పిస్తుంది. ఇది 12 రాశులపై ప్రభావం చూపుతోంది.
ధనస్సు రాశిలో సూర్యుడు, బుధుడు కలయిక వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల మూడు రాశుల వారికి శుభ ఫలితాలు ఇవ్వనుంది. కొత్త ఉపాధి, అపారమైన ఆర్థిక లాభాలను సైతం కలిగిస్తుంది.
జోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు, బుధుడి ప్రభావం చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. ఈ రెండింటి కలయిక.. బుధాదిత్య యోగాన్ని కల్పిస్తుంది. ఇది 12 రాశులపై ప్రభావం చూపుతోంది. సూర్యుడిని ఆత్మగౌరవం, ప్రతిష్ఠ, నాయకత్వానికి బాధ్యత వహించే గ్రహంగా పరిగణిస్తారు. బుధుడిని తెలివితేటలు, కమ్యూనికేషన్, వ్యాపారం పరంగా చూస్తారు. ఈ రెండు గ్రహాల ప్రభావం కెరీర్ విజయం, ఆర్థిక లాభాలు, సామాజిక గౌరవాన్ని ఇస్తుంది. ఈ రెండు గ్రహాలు కలిస్తే.. శక్తిమంతమైన రాజయోగాన్ని ఏర్పరుస్తోంది.
కన్యారాశి..
ఈ రాశి వారికి ఈ యోగం ప్రయోజనకరమైన ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి నుంచి నాలుగో ఇంట ఏర్పడుతుంది. ఇది భౌతిక ఆనందం, మాతృత్వ స్థానంగా పరిగణిస్తారు. దీంతో ఈ సమయంలో సకల సౌకర్యాలు, విలాసాలు పెరుగుతాయి. ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్, హోటల్లు, వైద్యం, వ్యాపారాల్లో పాల్గొనే వారికి ఇది సమయం. ఈ సమయంలో కుటుంబం, సామాజిక జీవితం సంతృప్తికరంగా ఉంటుంది.
సింహరాశి..
ఈ రాశి వారికి ఈ యోగంలో అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఈ రాజయోగం మీ జాతకంలో ఐదో ఇంట్లో ఏర్పడుతుంది. ఇది పిల్లలు, ప్రేమ సంబంధాలకు నిలయంగా పరిగణిస్తారు. విద్యార్థులు.. చదువు కోసం విదేశాలకు వెళ్లవచ్చు. లేదా మీ వీసాకు ఆమోద ముద్ర పడవచ్చు. మీ ప్రేమ జీవితంలో విజయం సాధించవచ్చు. అలాగే ఊహించని ఆర్థిక లాభాలను పొందవచ్చు. మీ తెలివితేటలు, వివేకం సరైన సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూల సమయం. మీ కోరికలు నెరవేర్చేందుకు అధిక అవకాశాలున్నాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది.
మీన రాశి..
ఈ రాశి వారికి వృత్తి, వ్యాపార పరంగా శుభప్రదమైనది. ఈ రాజయోగం.. మీ రాశి కర్మ భావంలో ఏర్పడుతుంది. అందువల్ల ఈ సమయంలో మీరు మీ పని, వ్యాపారంలో పురోగతిని సాధించవచ్చు. కొత్త అవకాశాలు వెల్లువెత్తుతాయి. మీరు సరై నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారం లేదా ఉద్యోగంలో లాభం పొందే సూచనలు కూడా ఉన్నాయి. మీ కృషి ఫలిస్తుంది. గణనీయమైన లాభాలకు మార్గాలు తెరుస్తుంది. ఆర్థిక విషయాల్లో లాభాలు పొందే అవకాశాలను సైతం కనుగొంటారు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని బలంగా మారుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. ఎంతో తెలుసా..
ఢిల్లీలో తెలంగాణ పోలీసుల ఆపరేషన్.. వెలుగులోకి సంచలన విషయాలు
Read Latest Devotional News And Telugu News