Eagle Team: ఢిల్లీలో తెలంగాణ పోలీసుల ఆపరేషన్.. వెలుగులోకి సంచలన విషయాలు
ABN , Publish Date - Nov 28 , 2025 | 02:50 PM
దేశ రాజధాని న్యూఢిల్లీలోని 20 ప్రదేశాలలో.. గడువు తీరిన 50 మందికిపైగా నైజీరియన్లు ఉన్నట్లు గుర్తించి.. వారిని ఈగల్ టీమ్ అరెస్ట్ చేసింది. నోయిడా, గ్వాలియర్, విశాఖపట్నం తదితర నగరాల్లో కీలక నిందితులను సై అరెస్ట్ చేసింది.
హైదరాబాద్, నవంబర్ 28: డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు ఈగల్ టీమ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో తెలంగాణ ఈగల్ టీమ్, ఎన్‌సీబీ, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాాయి. న్యూఢిల్లీలోని 20 ప్రాంతాల్లో.. గడువు తీరిన 50 మందికిపైగా నైజీరియన్లు ఉంటున్నట్లు గుర్తించింది. వారిని ఈ టీమ్ అదుపులోకి తీసుకుంది. నోయిడా, గ్వాలియర్, విశాఖపట్నం తదితర నగరాల్లో ఈ డ్రగ్స్‌తో సంబంధాలు ఉన్న కీలక నిందితులను అరెస్ట్ చేసింది.
నాలుగు ప్రాంతాల్లో 5,340 ఎక్స్ సిటీ మాత్రలు, 250 గ్రాముల కొకైన్, 109 గ్రాముల హెరాయిన్, 250 గ్రాముల మెథాంఫెటమైన్‌ను సీజ్ చేసింది. ఢిల్లీలోని 59 మ్యూల్ ఖాతాలతోపాటు 16 డ్రగ్స్ కేంద్రాలను గుర్తించింది. ఇక నైజీరియాకు చెందిన 107 బ్యాంకు ఖాతాలు ఈగల్ టీమ్ స్తంభింప జేసింది. మల్నాడు రెస్టారెంట్, మహీంద్రా యూనివర్సిటీ కేసులో నైజీరియన్ నిక్‌ను అరెస్ట్ చేసింది.
దేశవ్యాప్తంగా ఈ ముఠాతో దాదాపు 2 వేలకు పైగా డ్రగ్స్ వినియోగదారులు,పెడ్లర్లు ఉన్నట్లు ఈగల్ టీం గుర్తించింది. ఢిల్లీ నుంచి డ్రగ్స్ పార్శిళ్లు.. బూట్లు, దుస్తులు, కాస్మోటిక్ వస్తువులు, చెప్పులు మధ్యలో డ్రగ్స్ పెట్టి కొరియర్ ద్వారా సప్లై చేసినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. శ్రీ మారుతి కొరియర్స్, డీటీడీసీ, ప్రొఫెషనల్ కొరియర్స్, షిప్ రాకెట్, ఇండియా పోస్ట్, ఢిల్లీ వేరీ, బ్లూ డార్ట్, ట్రాక్ ఆన్ తదితర కొరియర్స్ నెట్‌వర్క్‌ను ఈ నైజీరియన్ ముఠా ఉపయోగించినట్లు ఈ కేసు విచారణలో బహిర్గతమైంది.
మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కంట్రోల్‌కు ఈగల్ టీమ్ భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈ సందర్భంగా అంతర్జాతీయ డ్రగ్స్ ఆపరేషన్‌ను ఛేదించింది. ఢిల్లీలో అరెస్ట్ చేసిన 50 మందిని హైదరాబాద్‌కు తరలించేందుకు ఈ టీమ్ ఇప్పటికే చర్యలు చేపట్టింది. వీరిని హైదరాబాద్‌కు తరలించిన తర్వాత కోర్టులో హాజరుపరచనుంది. అనంతరం వీరిని మరింత లోతుగా విచారణ జరపనుందని తెలుస్తోంది. ఈ విచారణలో మరిన్నీ కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని ఈగల్ టీమ్ భావిస్తోంది. ఈ విచారణలో వీరు చెప్పే కీలక ఆధారాలతో మరిన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశం ఉందని సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
రాష్ట్రాల అధికారాలను హరించే విధంగా కేంద్ర విత్తన బిల్లు: మంత్రి తుమ్మల
ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన
Read Latest Telangana News and National News