Maoist Party: ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన
ABN , Publish Date - Nov 28 , 2025 | 09:47 AM
ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జనవరి 1వ తేదీన సాయుధ కాల్పులను విరమిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ప్రకటన విడుదల చేశారు.
హైదరాబాద్, నవంబరు28 (ఆంధ్రజ్యోతి): ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ (Maoist Party) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయుధ విరమణపై ఓ తేదీని ప్రకటించింది. జనవరి 1వ తేదీన సాయుధ కాల్పులను విరమిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఇవాళ(శుక్రవారం) ప్రకటన విడుదల చేశారు. ఒక్కొక్కరుగా లొంగిపోయే బదులు, అందరూ కలిసి లొంగిపోతామని ఈ లేఖలో పేర్కొన్నారు.
పరస్పర సమన్వయం , కమ్యూనికేషన్ కోసం నక్సల్ ప్రతినిధి ఓపెన్ ఫ్రీక్వెన్సీ నంబర్‌ను కూడా విడుదల చేసినట్లు తెలిపారు. తమకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం ఎదుట ఆయుధ విరమణ చేస్తామని స్పష్టం చేశారు. ఆయుధాలు వదులుకోవడం అంటే ప్రజలకు ద్రోహం చేయడం కాదని ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేర్కొన్నారు.
కాగా, మావోయిస్టుల చర్యలను కట్టడి చేయడానికి కేంద్రప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మావోయిస్టులను కేంద్ర బలగాలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నాయి. ఇటీవల ఏపీలోని మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు పలువురు కీలక నేతలు మృతిచెందారు. ఈ క్రమంలోనే ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం
ఈ వార్తలు కూడా చదవండి..
రాజకీయ నినాదాలు కాదు.. వివక్షకు ఆధారాలు చూపాల్సిందే
ముఖ్యమంత్రా.. రియల్ ఎస్టేట్ ఏజెంటా..?
Read Latest Telangana News and National News