Zodiac Signs: ఈ రాశులకు రాజయోగం..
ABN , Publish Date - Dec 01 , 2025 | 07:57 AM
డిసెంబర్ తొలి వారంలో అంగారకుడు తన సొంత రాశిలో సంచారం చేస్తున్నాడు. దీంతో కొన్ని రాశులకు రాజయోగం పట్టనుంది. ఇది శక్తివంతమైన రాజయోగం అని జోతిష్య పండితులు చెబుతున్నారు.
వేద జోతిష్య శాస్త్రాన్ని అనుసరించి.. డిసెంబర్ మొదటి వారంలో అంగారకుడు తన సొంత రాశిలో సంచారం చేయడం వల్ల రుచక రాజయోగం ఏర్పడుందని జోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ యోగం శక్తివంతమైనదని అంటున్నారు. దీని వల్ల మిథునం, తుల సహా కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. ఆర్థికంగా రెట్టింపు లాభాలను పొందే అవకాశం ఉంది. అలాగే సమాజంలో గౌరవం సైతం పొందుతారు. కెరీర్ పరంగా అద్భుతమైన పురోగతి సాధిస్తారు. వ్యాపారులకు మరింత ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.
మిథునం
ఈ రాశి వారికి డిసెంబర్ తొలి వారి లాభదాయకంగా ఉంటుంది. బంధువుల నుంచి గౌరవం లభిస్తుంది. ప్రత్యేక బహుమతులు అందుకుంటారు. ఈ సమయంలో మీ కోరికలు నెరవేరతాయి. మీ ప్యామిలీలో సంతోషం నెలకొంటుంది. మీ ప్రేమ, వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది.
తులా రాశి
ఈ రాశి వారికి ఆ మాసం మొదటి వారం శుభప్రదంగా ఉంటుంది. వారం ప్రారంభంలో కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు. మీ ఆదాయ వనరులతోపాటు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. వ్యాపారులు మంచి లాభాలు అందుకోనున్నారు. ఉద్యోగులకు కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. అవివాహితులకు వివాహ యోగం సూచితం.
వృశ్చికం
ఈ రాశి వారికి అన్ని రంగాల్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో ప్రభుత్వ పనుల్లో మంచి విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ఈ వారం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. ప్యామిలీలో సంతోషం ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.
ధనస్సు..
ఈ వారంలో ఈ రాశివారు అనేక ప్రయోజనాలు పొందనున్నారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు. మీ ప్యామిలీలో గతంలో కంటే సంతోషంగా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితంలో.. సంబంధాలు గతంలో కంటే సామరస్య పూర్వకంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. కష్ట సమయాల్లో మీ జీవిత భాగస్వామి నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తోంది. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని అందుకుంటారు.
కుంభరాశి..
ఈ రాశి వారికి తొలి వారం శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఊహించని లాభాలు అందుకునే అవకాశం ఉంది. కెరీర్‌లో మీరు పడుతున్న కష్టాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. తీర్థయాత్ర చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పోటీ పరీక్షల్లో విద్యార్థులు రాణిస్తారు. మీ పిల్లల నుంచి శుభవార్త వింటారు.
ముఖ్య గమనిక.. పైన అందించిన జోతిష్య సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
ఈ వార్తలు కూడా చదవండి..
జాక్‌పాట్ కొట్టనున్న ఈ రాశులు.. పట్టిందల్లా బంగారమే..!
తిరుమల శ్రీవారికి ‘డివోషనల్’, ‘సోషల్’ సేవ..
For More AP News And Telugu News