ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Anupriya: అయ్యో అనుప్రియ.. ఎంతపని చేశావమ్మా.. ఏం జరిగిందంటే..

ABN, Publish Date - Apr 17 , 2025 | 11:05 AM

చేయని తప్పునకు నింద మోయాల్సి రావడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అనుప్రియ అనే వైద్య విద్యార్థినిపై దొంగతనం నేరం మోపడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

- చోరీ చేసిందని ఆరోపణలు.. మెడికో ఆత్మహత్య

చెన్నై: నగదు చోరీ చేసేందనే ఆరోపణలు తట్టుకోలేని వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. తిరువణ్ణామలై(Tiruvannamalai)కి చెందిన గోవిందరాజ్‌ కొన్నేళ్ల క్రితం మృతిచెందాడు. ఆయన కుమార్తె అనుప్రియ (19) కోవై పీలమేడులోని ప్రైవేటు కళాశాలలో మొదటి సంవత్సరం వైద్య కోర్సు చదువుతోంది. అలాగే, కళాశాల ఆస్పత్రిలో శిక్షణ పొందుతోంది. కొద్దిరోజుల క్రితం అనుప్రియ బసచేస్తున్న గదిలో నగదు కనిపించకుండా పోయింది.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: హల్వా వ్యాపారి కుటుంబంలో వరకట్నం వేధింపులు


ఈ నగదు అనుప్రియ దొంగిలించిందని సహచర విద్యార్థుల ఫిర్యాదుతో కళాశాల యాజమాన్యం అనుప్రియ(Anupriya)ను విచారించింది. అప్పటినుంచి మనస్తాపంగా ఉన్న అనుప్రియ, మంగళవారం మధ్యాహ్నం ఆస్పత్రిలో శిక్షణకు వెళ్లి, అకస్మాత్తుగా భవనంలోని 5వ అంతస్తుకు వెళ్లి అక్కడ నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పీలమేడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోవై ప్రభుత్వాసుపత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి

తరగతి గదిలో పెచ్చులూడి పడి..

ప్రైవేట్‌ ఆస్పత్రి పొమ్మంటే.. సర్కారు దవాఖానా ప్రాణాలు నిలిపింది

దుబాయిలో అసలేం జరిగింది..?

తెలంగాణ పోలీసులకు సీఎం అభినందనలు

ఫస్ట్ టైం తెలుగులో...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 17 , 2025 | 11:05 AM