Chennai: హల్వా వ్యాపారి కుటుంబంలో వరకట్నం వేధింపులు
ABN , Publish Date - Apr 17 , 2025 | 10:36 AM
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘ఇరుట్టుకడై హల్వా’ దుకాణం యజమాని కుమార్తెను అల్లుడు కట్నం కోసం వేధిస్తున్నాడనే ఫిర్యాదుపై తిరునల్వేలి నగర పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ విషయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
- అల్లుడిపై ఇరుట్టుకడై హల్వా దుకాణం యజమానురాలి ఫిర్యాదు
చెన్నై: తిరునల్వేలి నగరం నెల్లయప్పర్ ఆలయం ఎదుటనున్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ‘ఇరుట్టుకడై హల్వా’ దుకాణం యజమాని కుమార్తెను అల్లుడు కట్నం కోసం వేధిస్తున్నాడనే ఫిర్యాదుపై ఆ నగర పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ విషయమై ఆ దుకాణం యజమానురాలు కవితాసింగ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన కుమార్తె శ్రీకనిష్క(Sri Kanishka)ను కోయంబత్తూరుకు చెందిన బలరామ్ సింగ్ అనే యువకుడికిచ్చి ఫిబ్రవరి రెండున వివాహం జరిపించామని తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: EPS: తేల్చేశారు.. ఆ పార్టీలకు అధికారంలో భాగస్వామ్యం ఇవ్వబోం..
అల్లుడు బలరామ్‌సింగ్ ప్రస్తుతం విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడని, తరచూ స్వస్థలానికి వచ్చి తన కుమార్తెను కట్నం కోసం వేధిస్తున్నాడని, అతడి కుటుంబీకులు కూడా చిత్రహింసలు పెట్టి పనిమనిషి కంటే హీనంగా చూస్తున్నారని ఆరోపించారు. అల్లుడు బలరామ్‌సింగ్(Balaram Singh)కు మరో యువతితో వివాహేతర సంబంధం ఉందని, ఆ యువతిని ఇంటికి తీసుకొచ్చి ఆమె ఎదుటే తన కుమార్తెపై వేధింపులకు పాల్పడుతున్నాడని తెలిపారు.

వీటన్నింటి కంటే తిరునల్వేలిలో ఉన్న ఇరుట్టుకడై హల్వా దుకాణాన్ని తనకు రాసిస్తేనే కాపురం చేస్తానంటూ బెదరిస్తున్నాడని తెలిపారు. ఈ వివరాలతో తాను కుమార్తెతోపాటు తిరునల్వేలి నగర పోలీసు కమిషనర్‌కు, ముఖ్యమంత్రి ప్రత్యేక ఫిర్యాదుల విభాగానికి వినతి పత్రాలు అందజేసినట్లు కవితా సింగ్ తెలిపారు. ఇక అల్లుడు బలరామ్‌సింగ్, అతడి కుటుంబీకులు తమకు బీజేపీ నాయకుల మద్దతు ఉందని బెదిరిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రైవేట్ ఆస్పత్రి పొమ్మంటే.. సర్కారు దవాఖానా ప్రాణాలు నిలిపింది
తెలంగాణ పోలీసులకు సీఎం అభినందనలు
Read Latest Telangana News and National News