Hyderabad: అమ్మ ప్రేమకు నోచుకోవాల్సిన శిశువు మురుగు కాలువలో..
ABN, Publish Date - Oct 29 , 2025 | 07:14 AM
అమ్మ ప్రేమకు నోచుకోవాల్సిన శిశువు మురుగు కాలువలో విగతజీవిగా కనిపించడం స్థానికులను కలిచివేసింది. తల్లి ఆప్యాయత, అనురాగాలకు ఏ శిశువు కూడా దూరం కాకూడదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
- మురుగు కాల్వలో పసికందు మృతదేహం లభ్యం
హైదరాబాద్: అమ్మ ప్రేమకు నోచుకోవాల్సిన శిశువు మురుగు కాలువలో విగతజీవిగా కనిపించడం స్థానికులను కలిచివేసింది. తల్లి ఆప్యాయత, అనురాగాలకు ఏ శిశువు కూడా దూరం కాకూడదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హృదయవిదాయకర సంఘటన సంతోష్ నగర్ కాలనీ(Santoshnagar Colony)లో వెలుగుచూసింది. ఇన్‌స్పెక్టర్ కోల సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం..
సంతోష్ నగర్.. అరుంధతికాలనీ మురుగుకాలువలో నెల వయసు ఉన్న ఓ ఆడశిశువు కనిపించింది. పసికందును చూసిన ఓ వ్యక్తి మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో డయల్ 100కు కాల్ చేసి సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి సిబ్బందితో కలిసి ఇన్‌స్పెక్టర్ చేరుకొని పరిశీలించారు.
కాలువలో తేలుతున్న పసికందు మృతదేహాన్ని వెలికి తీయించి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పాప మృతదేహాన్ని తెచ్చి నాలాలో పడేశారా? వేరే కారణాలు ఏవైనా ఉన్నాయా? అనే కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆపై కాలువ పరివాహ ప్రాంతంలోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News
Updated Date - Oct 29 , 2025 | 07:14 AM