అయ్యోపాపం.. ఎంతఘోరం జరిగిందో.. విషయం ఏంటంటే..
ABN, Publish Date - May 16 , 2025 | 01:05 PM
ఏం జరిగిందో తెలియదు.. కానీ.. రెండు నిండు ప్రాణాలు మాత్రం అనంత వాయువుల్లో కలిసిపోయాయి. పెళ్లైన కొద్దికాలానికే భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. అందులో మరో కొద్దిరోజుల్లో ఆ ఇంట్లో చంటిబిడ్డ కేకలు వినాల్సి ఉండగా ఇంతలోనే ఈ విషాదం నెలకొంది.
- దంపతుల ఆత్మహత్య
చెన్నై: నాలుగు నెలల గర్భిణి ఆత్మహత్యకు పాల్పడగా, ఈ విషయం తెలిసి తట్టుకోలేక భర్త కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తిరువణ్ణామలై జిల్లాలో చోటుచేసుకుంది. వందవాసి సమీపం విళుదుపట్టు గ్రామానికి చెందిన వేలు కుమార్తె దివ్య (19), తళుతాలై గ్రామానికి చెందిన చెల్లప్పన్ కుమారుడు ప్రతాప్‌ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం దివ్య నాలుగు నెలల గర్భంతో ఉంది. పదిరోజుల క్రితం కన్నవారింటికి వచ్చిన దివ్య, ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ వార్తను కూడా చదవండి: Chennai: 8 వేల ఏళ్లనాటి రాతి పనిముట్లు లభ్యం
ఈ సమాచారం తెలుసుకున్న ప్రతాప్.. విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. చుట్టుపక్కల వారు అతడిని వందవాసి ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం చెంగల్పట్టు ప్రభుత్వ వైద్యకళాశాలకు తరలించారు. అక్కడ చికిత్సలు ఫలించక ప్రతాప్ మృతిచెందాడు. ఈ ఘటనపై వందవాసి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరలు ఢమాల్.. లక్ష నుంచి దిగజారుతూ..
తెలంగాణలో 22కోట్ల ఏళ్ల నాటి రాక్షసబల్లి అవశేషాలు
పకృతి విధ్వంసానికి సీఎందే బాధ్యత: కేటీఆర్
ఆర్టీసీ సీసీఎస్‌లో 15 రోజుల్లోగా రూ.1,029 కోట్లు జమ చేయాలి
Read Latest Telangana News and National News
Updated Date - May 16 , 2025 | 01:06 PM