Khammam: అమ్మ దొంగ అరెస్టయ్యాడు..
ABN, Publish Date - Mar 19 , 2025 | 09:59 AM
కన్నతల్లికి ఓ చీర కొనిపెడదామని చోరీకి పాల్పడి చివరకు దొంగతనాలు చేయడమే పనిగా పెట్టకుని నేడు అంతర్రాష్ట్ర దొంగగా మారాడు. తన పాపం పండి చివరకు పోలీసుల చేతికి చిక్కాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- అమ్మ చీర కోసం మొదలుపెట్టి తెలుగు రాష్ట్రాల్లో వరుస చోరీలు
- చోరీ సొత్తు శ్మశానంలో దాచి అక్కడే ఉండే కేటుగాడు
- అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు.. రూ.45 లక్షల సొత్తు రికవరీ
సత్తుపల్లి(ఖమ్మం): అమ్మకు ఓ చీర కొనిపెడదామని చోరీలు మొదలుపెట్టి అంతర్రాష్ట్ర దొంగగా ఎదిగిన ఓ కేటుగాడిని ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. దోచుకున్న సొమ్మును శ్మశానంలో దాచుకుని అక్కడే తలదాచుకునే ఆ దొంగ దగ్గర నుంచి రూ.45 లక్షల విలువైన సొత్తును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఖమ్మం పోలీసు కమిషనర్ సునీల్‌దత్ సత్తుపల్లిలో మంగళవారం విలేకరులకు వివరించారు.
ఈ వార్తను కూడా చదవండి: Cybercriminals: ఏఐతో వృద్ధురాలికి టోకరా.. ఆమె వదినలా మాట్లాడి..
ఏపీలోని ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిత్తాపూర్‌కు చెందిన తిరువీధుల సురేందర్ తన తల్లికి చీర కొనివ్వాలనే కోరికతో మొట్టమొదటిసారి రూ.300 చోరీ చేశాడు. ఆ డబ్బుతో చీర కొనుగోలు చేసిన సురేందర్ దొంగతనాలను వృత్తిగా మార్చుకుని అంతర్రాష్ట్ర దొంగయ్యాడు. తెలంగాణ, ఏపీ(Telangana, AP)ల్లో 90 చోరీ కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. గత నవంబరులో రాజమండ్రి జైలు నుంచి విడుదలైన సురేందర్.. తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ వరుస చోరీలకు పాల్పడ్డాడు. తెలంగాణలోని ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, సూర్యాపేట, నల్లగొండ(Kothagudem, Mahabubabad, Warangal, Suryapet, Nalgonda) జిల్లాలతో పాటు ఏపీలోని ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మూడు నెలల వ్యవధిలోనే 43 చోరీలు చేశాడు.
గూగుల్ మ్యాప్స్ యాప్ సాయంతో చోరీ చేయాలనుకునే ఇళ్లను గుర్తించే సురేందర్.. దోచుకున్న సొత్తును స్మశాన వాటికల్లో దాచిపెట్టి అక్కడే తలదాచుకుంటాడు. ఈ క్రమంలో మార్చి 10న ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సురేందర్‌ను గుర్తించిన నరేష్ అనే కానిస్టేబుల్ అతనిని అనుసరించాడు. ఇది గమనించిన సురేందర్.. నరేష్‌పై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. దీంతో సురేందర్ ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు .. సత్తుపల్లి మండలం కొత్తూరు సమీపంలోని స్మశాన వాటిక వద్ద అతడిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.
సురేందర్ దగ్గర 461.18గ్రాముల బంగారు, 426గ్రాముల వెండి ఆభరణాలు, రూ.3.33లక్షల నగదు, ఒక మొబైల్‌ఫోన్, రెండు ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం సొత్తు విలువ రూ.45లక్షలు ఉంటుందని తెలిపారు. కొన్ని ఆయుధాలను కూడా సీజ్ చేశారు. కాగా, సురేందర్ చేసిన దాడిలో గాయపడిన కానిస్టేబుల్ నరే్‌షను ఆస్పత్రికి తరలించిన ఇల్లంగి రాజు, చెరుకుపల్లి ప్రసాద్‌కు సీపీ సునీల్‌దత్ నగదు రివార్డు అందజేశారు. సురేందర్‌ను అరెస్ట్ చేసిన సత్తుపల్లి ఎస్సై టి.కవిత ఇతర సిబ్బందిని కూడా అభినందించి నగదు అవార్డులు అందజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
సమాధానాలు చెప్పలేక ప్రశ్నోత్తరాలను ఎత్తేస్తారా?
కేసీఆర్‌కు అసెంబ్లీని ఫేజ్ చేసే దమ్ములేదు
రేవంత్ ప్రభుత్వంలో ఆ స్కీమ్ బాగుంది
పులి సంచారం అంటూ వార్తలు.. నిర్ధారించని అధికారులు
Read Latest Telangana News and National News
Updated Date - Mar 19 , 2025 | 09:59 AM