Share News

Cybercriminals: ఏఐతో వృద్ధురాలికి టోకరా.. ఆమె వదినలా మాట్లాడి..

ABN , Publish Date - Mar 19 , 2025 | 08:36 AM

మొన్న 11.25 లక్షలు, నిన్న 8.20 లక్షలు, నేడు రూ. 1.90 లక్షలు... ఇలా నగరంలో ఎవరో ఒకరు సైబర్ మోసాలకు బలైపోతూనే ఉన్నారు. ఎవరో చదువురాని వాళ్లంటే ఏమో అనుకోవచ్చుగాని, విద్యావేత్తలు, చివరకు ఉద్యోగస్తులు కూడా సైబర్ మోసాలకు బలైపోతూనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Cybercriminals: ఏఐతో వృద్ధురాలికి టోకరా.. ఆమె వదినలా మాట్లాడి..

- 1.90 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

హైదరాబాద్‌ సిటీ: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఉపయోగించి ఆమె వదిన మాట్లాడినట్లుగా నమ్మించిన సైబర్‌ కేటుగాళ్లు నగరానికి చెందిన 72 ఏళ్ల వృద్ధురాలి నుంచి రూ.1.97లక్షలు కొల్లగొట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరానికి చెందిన వృద్ధురాలికి అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటున్న వదిన ఫోన్‌ నుంచి వాట్సాప్‌ మెసేజ్‌(WhatsApp message) వచ్చింది. డీపీలో మరదలు ఫొటోనే ఉంది. ‘అత్యవసరంగా నాకు కొంత డబ్బు సర్దుబాటు చేయాలి’ అని ఆ మెసేజ్‌లో ఉంది.

ఈ వార్తను కూడా చదవండి: AV Ranganath: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ సీరియస్ వార్నింగ్.. అసలేం జరిగిందంటే..


కంగారుపడిన బాధితురాలు వెంటనే వదిన ఫొటో ఉన్న ఆ నంబర్‌కు వాట్సాప్‌ కాల్‌ చేసింది. కాల్‌ లిఫ్ట్‌ చేసిన మహిళ ‘అవును నేనే అర్జంటుగా పంపండి’ అని చెప్పింది. దాంతో బాధితురాలు వాట్సా్‌పలో మెసేజ్‌ పంపిన ఖాతాకు రూ.1.97 లక్షలు గూగుల్‌పే చేసింది. ఆ తర్వాత నిధానంగా మరోసారి వదినకు ఫోన్‌ చేయగా అసలు విషయం తెలిసి షాకైంది. తాను ఎలాంటి మెసేజ్‌ పంపలేదని, మాట్లాడింది తనతో కాదని,


city4.2.jpg

తన ఫొటోను డీపీగా పెట్టి నేరగాళ్లు ఇలా చేసి ఉంటారని పేర్కొనడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించిన క్రిమినల్స్‌, బాధితురాలు ఫోన్‌ చేయగానే వదిన మాట్లాడినట్లుగానే వాయిస్‌ వినిపించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి:

సమాధానాలు చెప్పలేక ప్రశ్నోత్తరాలను ఎత్తేస్తారా?

కేసీఆర్‌కు అసెంబ్లీని ఫేజ్ చేసే దమ్ములేదు

రేవంత్ ప్రభుత్వంలో ఆ స్కీమ్ బాగుంది

పులి సంచారం అంటూ వార్తలు.. నిర్ధారించని అధికారులు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 19 , 2025 | 10:57 AM