ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tirupati: అడవిలో మృతదేహాలపై వీడని మిస్టరీ..

ABN, Publish Date - Sep 16 , 2025 | 11:07 AM

పనపాకం రిజర్వు ఫారెస్ట్‌ ఫరిధిలో ఇద్దరి వ్యక్తుల మృతదేహాల గుర్తింపులో చిక్కుముడి వీడలేదు. ఇక్కడి అడవిలో రెండు మృతదేహాలను ఆదివారం సాయంత్రం గొర్రెల కాపరులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చిన విషయం తెలిసిందే. సీఐ సుదర్శన్‌ ప్రసాద్‌, తహసీల్దార్‌ సంతోష్‌ సాయి, సిబ్బంది సోమవారం వెళ్లి పరిశీలించారు.

- హత్య కోణంలోనూ అనుమానాలు

- రెండు గోతుల్లో ఏముందో తేలేది రేపే

పాకాల(తిరుపతి): పనపాకం రిజర్వు ఫారెస్ట్‌ ఫరిధిలో ఇద్దరి వ్యక్తుల మృతదేహాల గుర్తింపులో చిక్కుముడి వీడలేదు. ఇక్కడి అడవిలో రెండు మృతదేహాలను ఆదివారం సాయంత్రం గొర్రెల కాపరులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చిన విషయం తెలిసిందే. సీఐ సుదర్శన్‌ ప్రసాద్‌, తహసీల్దార్‌ సంతోష్‌ సాయి, సిబ్బంది సోమవారం వెళ్లి పరిశీలించారు. చెట్టుకు వేలాడుతున్న పురుషుడి మృతదేహాన్ని కిందికి దించారు.

దీనితోపాటు అక్కడే కిందఉన్న మహిళ మృతదేహానికి సాయంత్రం వైద్యులు అక్కడే పోస్టుమార్టం చేశారు. ఇవి కుళ్లిపోయి గుర్తుపట్టలేని స్ధితిలో ఉండటతో అక్కడే ఖననం చేశారు. ఫోరెన్సిక్‌ క్లూస్‌ టీమ్‌ పరిసరాల్లో ఆనవాళ్లు సేకరించింది. కాగా పక్కనే రెండు గోతుల్లో చిన్నారుల మృతదేహాలు ఉన్నాయని భావిస్తున్నారు. గుంతలు తవ్వేందుకు ప్రయత్నించేలోగానే చీకటి పడింది. మంగళవారం తవ్వి పరిశీలించనున్నారు. మృతులు తమిళనాడు తంజావూరు(Tamilnadu Tanjavuru)కు చెందిన వారుగా భావిస్త్తున్నారు.

తంజావూరుకు చెందిన కళైసెల్వన్‌ అనే మానసిక వైద్యుని వద్ద మేలో చికిత్స తీసుకున్న ప్రిస్ర్కిప్షన్‌ సంఘటనా స్థలంఓ లభించింది. అంతకుమించి ఎలాంటి ఆనవాళ్లు లభించలేదని పోలీసులు తెలిపారు. మహిళ, పురుషుడి నోట్లో గుడ్డలు, గ్లౌజులు కుక్కి, నోటికి ప్లాస్టర్‌ వేసి ఉంది. ఎక్కడో హత్య చేసి ఇక్కడకు తీసుకొచ్చి చెట్టుకు ఉరివేశారా, ఇక్కడే చంపేశారా అనేది మిస్టరీగా ఉంది. పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ తగ్గిన బంగారం ధరలు..కానీ వెండి మాత్రం

మొదటి పావుగంటలో రిజర్వేషన్లకు ఆధార్‌

ప్రైవేటు కాలేజీల ఆందోళనలకు సంపూర్ణ మద్దతు

Read Latest Telangana News and National News

Updated Date - Sep 16 , 2025 | 11:07 AM