Gold and Silver Rates Today: షాకింగ్..మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
ABN , Publish Date - Sep 16 , 2025 | 06:32 AM
దేశంలో బంగారం, వెండి ప్రియులకు షాకింగ్ న్యూస్. నిన్న తగ్గిన ధరలకు మళ్లీ బ్రేక్ పడింది. అయితే వీటి ధరలు ఏ మేరకు పెరిగాయి, ఎంతకు చేరుకున్నాయనే విషయాలను ఇక్కడ చూద్దాం.
బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావిస్తున్నవారికి మళ్లీ షాకింగ్ న్యూస్. నిన్న తగ్గిన ధరలు కొంత ఊరట ఇచ్చినా, అది ఎక్కువ కాలం నిలవలేదు. మళ్లీ ధరలు పెరిగి, కొనుగోలుదారులను ఆందోళనలోకి నెట్టేశాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, సెప్టెంబర్ 16, 2025 ఉదయం 11 గంటల సమయంలో బంగారం, వెండి రేట్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ పెరుగుదల పండుగల సీజన్ ముందు మరింత ప్రభావం చూపనుంది.
ఈ రోజు బంగారం ధరలు (సెప్టెంబర్ 16, 2025)
24-క్యారెట్ బంగారం: గ్రాముకు రూ. 11,193 (రూ. 87 పెరుగుదల)
22-క్యారెట్ బంగారం: గ్రాముకు రూ. 10,260 (రూ. 80 పెరుగుదల)
18-క్యారెట్ బంగారం: గ్రాముకు రూ. 8,395 (రూ. 66 పెరుగుదల)
వెండి ధరలు కూడా హైదరాబాద్, విజయవాడలో కిలోకు రూ.1,44,000కు చేరుకున్నాయి. (రూ.1,100 పెరుగుదల)
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నైలో 24 క్యారెట్ బంగారం గ్రాముకు రూ.11,215 కాగా, 22 క్యారెట్ రూ.10,280, 18 క్యారెట్ రూ.8,515
ముంబైలో 24 క్యారెట్ రూ.11,193, 22 క్యారెట్ రూ.10,260, 18 క్యారెట్ రూ.8,395
ఢిల్లీలో 24 క్యారెట్ రూ.11,208, 22 క్యారెట్ రూ.10,275, 18 క్యారెట్ రూ.8,409
కోల్‌కతాలో 24 క్యారెట్ రూ.11,193, 22 క్యారెట్ రూ.10,260, 18 క్యారెట్ రూ.8,395
బెంగళూరులో 24 క్యారెట్ రూ.11,193, 22 క్యారెట్ రూ.10,260, 18 క్యారెట్ రూ.8,395.
హైదరాబాద్, కేరళ, పూణెలో కూడా బంగారం ధరలు సమానంగా ఉన్నాయి 24 క్యారెట్ రూ.11,193, 22 క్యారెట్ రూ.10,260, 18 క్యారెట్ రూ.8,395.
బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి మీరు కొనుగోలు చేయాలని భావించినప్పుడు మళ్లీ రేట్లు గురించి తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి