Indian Railways New Rule: మొదటి పావుగంటలో రిజర్వేషన్లకు .. అది తప్పనిసరి
ABN , Publish Date - Sep 16 , 2025 | 06:11 AM
టిక్కెట్ల రిజర్వేషన్లలో అక్రమార్కుల ఆటకట్టించడానికి రైల్వేశాఖ మరో నిర్ణయం తీసుకొంది. జనరల్ కోటా టిక్కెట్ల రిజర్వేషన్ల బుకింగ్ కోసం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ఓపెన్ అయిన మొదటి 15 నిమిషాల్లో...
రైల్వే శాఖ కొత్త రూల్.. అక్టోబరు 1 నుంచి అమలు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 15: టిక్కెట్ల రిజర్వేషన్లలో అక్రమార్కుల ఆటకట్టించడానికి రైల్వేశాఖ మరో నిర్ణయం తీసుకొంది. జనరల్ కోటా టిక్కెట్ల రిజర్వేషన్ల బుకింగ్ కోసం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ఓపెన్ అయిన మొదటి 15 నిమిషాల్లో టిక్కెట్లు తీసుకోవాలంటే ఆ వెబ్‌సైట్‌కు ఆధార్ అనుసంధాన్ని తప్పనిసరి చేసింది. అంటే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌కు ఆధార్‌ను లింక్ చేసుకున్నవారికే మొదటి 15 నిమిషాల్లో టిక్కెట్లు లభిస్తాయి. ఈ నూతన నిబంధన అక్టోబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. రిజర్వేషన్ల బుకింగ్‌లకు మొదటి 15 నిమిషాల్లోనే డిమాండు అధికంగా ఉండడంతో దాన్ని అక్రమార్కులు అవకాశంగా తీసుకోకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు చేసింది. అనంతరం ఆధార్ అనుసంధానం లేనివారు కూడా రిజర్వేషన్లు తీసుకోవచ్చు. ఇంతవరకు తత్కాల్ టిక్కెట్లకే పరిమితమైన నిబంధనను ఇకపై జనరల్ టిక్కెట్లకు కూడా వర్తింపజేసింది. ఉదాహరణకు ఎవరైనా నవంబరు 15 కోసం రిజర్వేషన్లు చేయాలనుకుంటే అందుకు సంబంధించి 60 రోజులు ముందుగా అంటే సెప్టెంబరు 16వ తేదీ ఉదయం 12.20 గంటలకు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. 12.20 గంటల నుంచి 12.35 గంటల వరకు కేవలం ఆధార్ వెరిఫికేషన్ ఉన్న ప్రయాణికులు మాత్రమే టిక్కెట్లు బుక్ చేసుకోగలుగుతారు. కీలకమైన ఈ 15 నిమిషాల వ్యవధిలో ఆధార్ అనుసంధానంలేని వారికి బుక్ చేసుకునే అవకాశం ఉండదు. పండగ సమయాల్లో టిక్కెట్ల డిమాండు అత్యధికంగా ఉండడాన్ని గమనించి, అక్కడ అక్రమాలు జరగకుండా నిరోధించడానికి ఈ ఏర్పాటు చేసింది. అందువల్ల అక్టోబరు ఒకటో తేదీలోగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌తో ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలని ప్రయాణికులకు రైల్వే శాఖ సూచించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్
భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
For AP News And Telugu News