BJP Telangana chief Ranchoddar Rao: ప్రైవేటు కాలేజీల ఆందోళనలకు సంపూర్ణ మద్దతు
ABN , Publish Date - Sep 16 , 2025 | 06:09 AM
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, విద్యా వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని బీజేపీ..
మాటలకు, చేతలకు పొంతన లేదు: ఈటల
హైదరాబాద్, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, విద్యా వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ మొత్తాన్ని విడుదల చేయాలని కోరుతూ ప్రైవేట్ కాలేజీలు చేస్తున్న ఆందోళనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ఒక్క పైసా కూడా రీయింబర్స్‌మెంటు బకాయిలు ఇవ్వలేదని, బకాయిలు భారీగా పెరిగిపోవడంతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడ్డాయని, కాలేజీలను తాత్కాలికంగా మూసివేయాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. కాగా, ప్రభుత్వ మాటలకు, చేతలకు పొంతన లేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. హుజూరాబాద్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండేళ్ల ఫీజులు బకాయి పెడితే.. ఈ సర్కారు ఇప్పటి వరకూ పైసా ఇవ్వలేదని మండిపడ్డారు.