Hyderabad: రూ.లక్షకు లక్షాముప్పై వేలు..
ABN, Publish Date - May 22 , 2025 | 07:22 AM
హైదరాబాద్ నగరంలో మరో మోసం వెలుగులోకి వచ్చింది. రూ.లక్షకు లక్షాముప్పై వేలు ఇస్తామంటూ నమ్మబలికి మోసానికి పాల్పడ్డారు. ఇప్పటికే పలు మోసాలు వెలుగుచూస్తుండగా.. కొత్తకొత్త పద్దతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.
సౌదీ కరెన్సీ పేరుతో మోసం
రెండు లక్షలు తీసుకొని తెల్లకాగితాలు అప్పగింత
ముగ్గురి అరెస్ట్.. పరారీలో ప్రధాన సూత్రధారి
హైదరాబాద్: ‘రూ.లక్షకు ముప్పైవేలు అదనంగా ఇస్తాం. ఇండియన్ కరెన్సీ ఇస్తే లక్షా ముప్పైవేలు విలువ గల సౌదీ అరేబియా నగదు ఇస్తాం’ అని రెండు లక్షల తీసుకుని బ్యాగుతో తెల్లకాగితాలు ఇచ్చారు. బేగంపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్(Secundrabad)లోని వారాసిగూడకు చెందిన పర్వేజ్ (58) ఆటో డ్రైవర్. వారం రోజుల క్రితం చిలకలగూడ చౌరస్తాలో పర్వేజ్‌కు, ఇస్మాయిల్ అనే మరో ఆటోడ్రైవర్ పరిచయమయ్యాడు.
ఈ వార్తను కూడా చదవండి: Minister Uttam Kumar:బీఆర్‌ఎస్ వల్లే కృష్ణా జలాల్లో అన్యాయం
తన సోదరి వద్ద సౌదీ అరేబియా కరెన్సీ ఉందని, మన కరెన్సీ లక్ష రూపాయలు ఇస్తే దానికి బదులుగా సుమారు లక్షా ముప్పైవేల విలువ చేసే సౌదీ కరెన్సీ ఇస్తామని తెలిపాడు. అతడి ఫోన్ నంబర్ తీసుకున్నాడు. అనంతరం ఇస్మాయిల్ సోదరి పేరుతో ఓ మహిళ ఫోన్ చేసి కరెన్సీ కావాలంటే బేగంపేట(Begampeta)కు రావాలని చెప్పింది. ఈనెల 19న ఉదయం పర్వేజ్ బేగంపేటలోని ఫ్యాంటలూన్ లేన్‌లోకి రాగా, ఆటోలో నలుగురు వ్యక్తులు వచ్చి సౌదీ అరేబియా కరెన్సీ అని చెప్పి బ్యాగు చూపించారు.
నిజమని నమ్మిన పర్వేజ్ వారికి రెండు లక్షలు ఇచ్చాడు. వారు బ్యాగును పర్వేజ్‌కు ఇచ్చి వెళ్లిపోయారు. అనంతరం బ్యాగు తెరిచి చూడగా అందులో తెల్లకాగితాలు దర్శనమిచ్చాయి. మోసపోయానని గ్రహించిన పర్వేజ్ ఈనెల 20న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు రెండు టీంలను ఏర్పాటు చేసి వారి కోసం తీవ్రంగా గాలించారు. అబూభకర్, సంధ్య అలియాస్ సాదియా, శాంతిలను అరెస్టు చేశారు. ప్రధాన సూత్రదారి సోయల్ పరారీలో ఉన్నాడు.
ఈ వార్తలు కూడా చదవండి.
Gold Rates Today: భారీ షాక్ ఇచ్చిన బంగారం, వెండి ధరలు.. చివరకు..
Kaleshwaram: కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతు ప్రణాళికలేవి
BJP National President K Laxman: వ్యవస్థలో మార్పే అసలైన పరీక్ష
Asaduddin Owaisi: వక్ఫ్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే
Kaleshwaram Pushkaralu: భక్తజన సంద్రం.. త్రివేణీ సంగమం
Read Latest Telangana News and National News
Updated Date - May 22 , 2025 | 07:22 AM