ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: ప్రేమపేరుతో బాలికను తల్లిని చేసిన యువకుడు

ABN, Publish Date - Nov 08 , 2025 | 08:47 AM

హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న ఓ 17 ఏళ్ల బాలికను అదే కళాశాలలో సీనియర్‌గా చదువుకుంటున్న యువకుడు ప్రేమ పేరుతో తల్లిని చేశాడు. ఆ బాలిక గురువారం ఆసుపత్రిలో పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. కడపలోని వసతి గృహంలో ఉంటూ కాలేజీకి వెళ్లి తిరిగి హాస్టల్‌కు వస్తుండేది.

- పోక్సో కేసు నమోదు

కడప: హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న ఓ 17 ఏళ్ల బాలికను అదే కళాశాలలో సీనియర్‌గా చదువుకుంటున్న యువకుడు ప్రేమ పేరుతో తల్లిని చేశాడు. ఆ బాలిక గురువారం ఆసుపత్రిలో పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. కడప(Kadapa)లోని వసతి గృహంలో ఉంటూ కాలేజీకి వెళ్లి తిరిగి హాస్టల్‌కు వస్తుండేది. కనీసం ఆ బాలిక గర్భంతో ఉన్న విషయాన్ని తోటి విద్యార్థులు కానీ, హాస్టల్‌ నిర్వాహకులు గుర్తించలేకపోవడం విశేషం. బాలికను గర్భవతిని చేసిన యువకుడిపై పోక్సో కింద కేసు నమోదు చేసినట్లు తాలూకా పోలీసులు తెలిపారు.

పోలీసుల వివరాల మేరకు.. ప్రకాఽశం జిల్లా బెస్తవారిపల్లెకు చెందిన శ్రీకాంత్‌ కడపలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఎమ్‌.ఎల్‌.టి చదువుతున్నాడు. అదే కళాశాలలో జూనియర్‌గా చదువుతున్న బాలికను ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. గురువారం కడుపు నొప్పి రావడంతో హాస్టల్‌ నిర్వహకురాలు వైద్య పరీక్షలు నిమిత్తం ఆసుపత్రికి తరలించగా ఆ బాలిక బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో యువకుడుపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల!

కిసాన్‌ డ్రోన్‌.. సాగు ఖర్చు డౌన్‌

Read Latest Telangana News and National News

Updated Date - Nov 08 , 2025 | 08:47 AM