Share News

Farming Technology: కిసాన్‌ డ్రోన్‌.. సాగు ఖర్చు డౌన్‌

ABN , Publish Date - Nov 08 , 2025 | 06:53 AM

డ్రోన్‌ సాంకేతికత వ్యవసాయ రంగంలో కొత్త శకానికి నాంది పలికింది. రైతులకు ఖర్చులు తగ్గించి, ఉత్పాదకతను పెంచడంలో ఓ మేరకు సహాయకారిగా మారింది.

Farming Technology: కిసాన్‌ డ్రోన్‌.. సాగు ఖర్చు డౌన్‌

  • ఉత్పాదకత పెంపులోనూ సహాయకారి

  • రైతుకు అందించడంపై వైసీపీ సర్కార్‌ నిర్లక్ష్యం

  • కూటమి పాలనలో అధిక ప్రాధాన్యం

  • తొలివిడత 875 గ్రూపులకు పంపిణీ

  • వెయ్యి డ్రోన్లు అందించాలన్నది లక్ష్యం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

డ్రోన్‌ సాంకేతికత వ్యవసాయ రంగంలో కొత్త శకానికి నాంది పలికింది. రైతులకు ఖర్చులు తగ్గించి, ఉత్పాదకతను పెంచడంలో ఓ మేరకు సహాయకారిగా మారింది. గత ప్రభుత్వం ఈ అత్యాధునిక సాంకేతికతను రైతులకు అందివ్వడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. కేంద్ర ప్రభుత్వం తొలి దశలో 870 కిసాన్‌ డ్రోన్లను రాష్ట్రానికి కేటాయించగా... వాటిని పంపిణీ చేయకుండా గత ప్రభుత్వం కాలయాపన చేసింది. టెక్నాలజీకి ప్రాధాన్యమిచ్చే సీఎం చంద్రబాబు రైతు బృందాలకు డ్రోన్లు ఇవ్వాలని నిర్ణయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సబ్‌ మిషన్‌ ఆన్‌ అగ్రికల్చరల్‌ మెకనైజేషన్‌(ఎ్‌సఎంఏఎం) పథకాన్ని సద్వినియోగం చేసుకుంది. రూ.10 లక్షల విలువ చేసే కిసాన్‌ డ్రోన్‌కు కేవలం 20ు చెల్లిస్తే 80ు సబ్సిడీతో రైతు బృందాలకు అందిస్తోంది. 2024-25లో 875 డ్రోన్లు పంపిణీ చేసింది. గరిష్టంగా పల్నాడు జిల్లాకు 61, కనిష్ఠంగా అల్లూరి, విశాఖ జిల్లాలకు ఒక్కొక్కటి ఇచ్చారు. 2025-26లో 1,000 డ్రోన్లు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధమౌతున్నాయి. ఇందుకోసం ఈ ఏడాది బడ్జెట్‌లో సబ్సిడీ కింద రూ.80 కోట్లు కేటాయించారు. ఐదుగురు సభ్యులు ఉన్న రైతు బృందానికి డ్రోన్‌ కేటాయిస్తారు. దాని నిర్వహణకు శిక్షణ పొందిన పైలట్‌నూ సమకూరుస్తారు. దీని వలన రైతుకు లాభంతో పాటు యువతకు జీవనోపాధి లభిస్తుంది. రైతు బృందం కేవలం తమ పొలాలకే కాకుండా తోటి రైతులకు డ్రోన్‌ సేవలు అందించవచ్చు. దీనిద్వారా ఒకటి, రెండు నెలల్లోనే డ్రోన్‌ కొనడానికి పెట్టిన 20 శాతం పెట్టుబడిని తిరిగి పొందుతున్నారు. గత ఖరీ్‌ఫలో లక్ష ఎకరాల్లో వివిధ పంటలపై పురుగు మందుల పిచికారికి వీటిని ఉపయోగించారు. ప్రస్తుత రబీలో 5 లక్షల ఎకరాలకు ఈ సేవలు విస్తృతం చేయాలని వ్యవసాయ శాఖ రైతు బృందాలకు నిర్దేశించింది. ఈక్రమంలో మరిన్ని డ్రోన్లు కోసం రైతుల నుంచి అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి.


యాంత్రీకరణ తప్పనిసరి

అంతర్జాతీయంగా ఆహార ఉత్పత్తులకు గణనీయమైన డిమాండ్‌ ఉంటోంది. అయితే ఓవైపు కూలీల డిమాండ్‌, మరోవైపు విపత్తులు... సాగు ఖర్చులు పెరిగి రైతులను కుంగదీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి సాంకేతికతను జోడించడం అవశ్యంగా మారింది. యాంత్రీకరణ తప్పనిసరి అవుతోంది. ఈ క్రమంలోనే అందుబాటులోకి వచ్చిన డ్రోన్‌ సాంకేతికత... ఉత్పత్తి స్థిరీకరణ, ఇన్‌పుట్‌ వ్యయం తగ్గింపు అంశాల్లో రైతుకు చేదోడుగా మారింది. పురుగు మందుల పిచికారికి ఇప్పటి వరకు రైతులు, కూలీలు చేతి పంపులు, ఇంజన్‌స్పేయర్లు వాడుతున్నారు. వాటి బదులు డ్రోన్లు వాడడం వల్ల పని తొందరగా అవుతుంది.


రంగా వర్సిటీలో పరిశోధనలు

వ్యవసాయ డ్రోన్లపై పరిశోధనలను 2018 నుంచి గుంటూరు సమీపంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చేస్తోంది. పురుగు మందులను డ్రోన్లతో వాడడాన్ని విస్తృతం చేయడంపై వర్సిటీ దృష్టి పెట్టింది. సాంప్రదాయ పద్ధతులతో పోల్చితే డ్రోన్‌ ఆధారిత పిచికారితో పురుగుమందుల వినియోగాన్ని 25 శాతం తగ్గించవచ్చని రంగా వర్సిటీ శాస్త్రవేత్తలు నిరూపించారు. వేర్వేరు పంటల్లో డ్రోన్‌ స్ర్పేయింగ్‌ కోసం ప్రామాణిక విధానాలపై మార్గదర్శకాలనూ తయారు చేశారు. కిసాన్‌ డ్రోన్లును సురక్షితంగా వాడడానికి ఒక ప్రత్యేక కేంద్రాన్ని... ఆంధ్రప్రదేశ్‌ సెన్సార్‌ అండ్‌ స్మార్ట్‌ అప్లికేషన్‌ రీసెర్చ్‌ ఇన్‌ అగ్రికల్చర్‌ (ఏపీఎ్‌సఏఆర్‌ఏ) ను ఏర్పాటు చేశారు. అగ్రికల్చర్‌ రిమోట్‌ పైలట్‌ కోర్సు(ఏపీఆర్‌సీ) పేరుతో కిసాన్‌ డ్రోన్ల నిర్వహణకు 12 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని రంగా వర్సిటీ నిర్వహిస్తోంది. డ్రోన్లు నిర్వహణను సురక్షితం చేయడానికి పంపిణీకి ముందు వర్సిటీ శాస్త్రవేత్త పర్యవేక్షణలో సమగ్ర (విమాన) పరీక్షలను నిర్వహించిన తర్వాతే వ్యవసాయ శాఖ రైతులకు కిసాన్‌ డ్రోన్లు పంపిణీ చేసింది. ఈ డ్రోన్లను వ్యవసాయ శాఖతో పాటు సరఫరా కంపెనీ డ్రోగో డ్రోన్స్‌ సాంకేతిక విభాగం పర్యవేక్షిస్తోంది. ఇటీవల మొంథా తుఫాన్‌ సహాయ చర్యల్లో కిసాన్‌ డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వీటిని అందించిన డ్రోగో డ్రోన్స్‌ సీఈవో యశ్వంత్‌కు ప్రభుత్వం అవార్డు కూడా ఇచ్చింది.


డ్రోన్‌తో సమయం, ఖర్చు ఆదా అవుతోంది

మొదట్లో డ్రోన్‌తో పురుగు మందులు స్ర్పే చేయడమంటే రైతులు ఆశ్చర్యపోయారు. అవగాహన కల్పించాక ఇప్పుడు మా మండలంలో చాలామంది మా డ్రోన్‌ను వాడుకుంటున్నారు. స్ర్పేయర్లతో రోజుకు రెండెకరాలే చేయగలరు. డ్రోన్‌తో 25ఎకరాల వరకూ చేయవచ్చు. మ్యాన్యువల్‌గా ఎకరానికి 100 లీటర్లు నీళ్లువాడితే... డ్రోన్‌తో 20-25 లీటర్లు సరిపోతుంది. ఎకరానికి రూ.350తీసుకుంటాం. ఒకటిన్నర ఎకరానికి మందు కొట్టాలంటే కూలీలకు రూ.700 ఇవ్వాలి. అదే సొమ్ముతో డ్రోన్‌తో 2ఎకరాలకు పని అయిపోతుంది.

- ఎస్‌ శివదత్తు, యువ రైతు, పోలవరం, ఏలూరు జిల్లా


సబ్సిడీ వల్లే తక్కువ చార్జి చేస్తున్నాం

వ్యవసాయ శాఖ ఇచ్చిన కిసాన్‌ డ్రోన్‌ను మా విఘ్నేశ్వర గ్రూపులోని రైతులందరం వినియోగిస్తున్నాం. ఎవరైనా రైతులు అడిగితే అద్దెకు ఇస్తున్నాం. సీఎం చంద్రబాబు సబ్సిడీపై డ్రోన్లు ఇవ్వడం వల్లే తక్కువ చార్జి చేస్తున్నాం. డ్రోన్‌కు 80ు సబ్సిడీ అంటే చిన్న విషయం కాదు! మాకు లేబర్‌ కొరత ఉన్నందున డ్రోన్‌ వాడకం వల్ల కూలీల డిమాండ్‌ తగ్గింది. డ్రోన్‌తో పని తేలిగ్గా అవుతోంది. చేతి పంపులతో పురుగు మందు పిచికారి చేస్తే మనుషులకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. డ్రోన్‌తో స్ర్పే చేయడం వల్ల ఆరోగ్యానికి ఇబ్బంది లేదు.

- పీ జస్వంత్‌రెడ్డి, యువ రైతు, పెనుబర్తి, నెల్లూరు జిల్లా

Updated Date - Nov 08 , 2025 | 06:54 AM