Hyderabad: ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి వచ్చి చివరకు...
ABN, Publish Date - Sep 25 , 2025 | 10:39 AM
కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యల నేపథ్యంలో మానసికంగా కృంగిపోయిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బాచుపల్లి పోలీసులు తెలిపిన ప్రకారం.. ప్రకాశం జిల్లా, మార్కాపురానికి చెందిన తోట శ్రావణ్ (32) సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ రాజీవ్‌గాంధీనగర్‌లోని గ్రీన్‌వ్యూ టవర్స్‌లోని పూజితా ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్నాడు.
ఉరేసుకొని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బలవన్మరణం
హైదరాబాద్: కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యల నేపథ్యంలో మానసికంగా కృంగిపోయిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బాచుపల్లి పోలీసులు(Bachupalli Police) తెలిపిన ప్రకారం.. ప్రకాశం జిల్లా, మార్కాపురానికి చెందిన తోట శ్రావణ్ (32) సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ రాజీవ్‌గాంధీనగర్(Rajeev Gandhi Nagar)లోని గ్రీన్‌వ్యూ టవర్స్‌లోని పూజితా ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్నాడు. ఆరు నెలల క్రితం భార్యాభర్తల మధ్య గొడవల జరగడంతో విడిపోయి ఉంటున్నారు.
దీంతో మానసికంగా కృంగిపోతున్న శ్రావణ్(Shravan).. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో తీవ్రమనోవేదనకు గురైన అతను బుధవారం ఉదయం 11 గంటలకు ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరలో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News
Updated Date - Sep 25 , 2025 | 10:39 AM