Hyderabad: కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని...
ABN, Publish Date - Dec 25 , 2025 | 09:38 AM
కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందన్న బాధతో.. ఓ తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన నగరంలో చోటుచేసుకుంది. కుత్బుల్లాపూర్ జయరామ్‌నగర్‌కు చెందిన కృష్ణ భార్య కొంపల్లి నాగమణి ఆగ్మహత్యకు పాల్పడింది. కూతురి ప్రేమ పెళ్లి చేసుకుందన్న బాధతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసివది.
- మనస్తాపంతో చెరువులో దూకి తల్లి ఆత్మహత్య
- జయరామ్‌నగర్‌లో ఘటన
హైదరాబాద్: కూతురు ప్రేమ వివాహం చేసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోవడం ఆ తల్లిని కృంగదీసింది. ఆమె అలా వెళ్లిపోవడం జీర్ణించుకోలేకపోయింది. తానెందుకు బతకాలని మనోవేదనకు గురైంది. చివరికి చెరువులో దూకి తానువు చాలించింది. ఈ సంఘటన జయరామ్‌నగర్‌లో బుధవారం వెలుగుచూసింది. పేట్‌బషీరాబాద్ ఎస్‌ఐ ధర్మేష్ తెలిపిన వివరాలు ప్రకారం.. కుత్బుల్లాపూర్(Quthbullapur) జయరామ్‌నగర్‌కు చెందిన కృష్ణ భార్య కొంపల్లి నాగమణి (42)కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు.
మూడు నెలలు క్రితం కన్న కూతురు ప్రేమ పెళ్లి చేసుకొని వెళ్లి పోయింది. అప్పటి నుంచి కూతురు లేనప్పుడు తన బతుకెందుకు? అని చుట్టుపక్కల వారితో చెప్పుకుంటూ నాగమణి మనోవేదనకు గురయ్యేది. ఈ నెల 24న ఆమె ఇంటిలో కనిపించక పోవడంతో తమ్ముడు రాజు మరి కొంత మందితో కలిసి ఫాక్స్ సాగర్ సమీపంలో వెతుకుతుండగా చెరువులో ఆమె మృతదేహమై కనిపించింది. పేట్‌బషీరాబాద్ పోలీసులకు రాజు ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని బయటికి తీయించి పోస్టు మార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎల్‌వీఎం 3 ఎం6కి అనంత్ టెక్నాలజీస్ పరికరాలు
సబ్బుల్లో నంబర్ 1 బ్రాండ్‌గా సంతూర్
Read Latest Telangana News and National News
Updated Date - Dec 25 , 2025 | 09:38 AM