Hyderabad: హిజ్రాల ఆందోళనలో అపశ్రుతి.. ఏం జరిగిందంటే..
ABN, Publish Date - Nov 18 , 2025 | 08:18 AM
హిజ్రాలు నిర్వహించిన ఆందోళనలో అపశ్రుతి చోటుచేసుకుంది. మోనాలిసా అనే హిజ్రాల గ్యాంగ్ లీడర్ తమపై దాడి చేసిందంటూ పలువురు హిజ్రాలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకుని లైటర్‌తో నిప్పు అంటించుకుంటుండగా ఏడుగురికి గాయాలయ్యాయి.
- ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న పలువురు హిజ్రాలు
- ఏడుగురికి గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం
హైదరాబాద్: హిజ్రాలు నిర్వహించిన ఆందోళనలో అపశ్రుతి చోటుచేసుకుంది. మోనాలిసా(Mona Lisa) అనే హిజ్రాల గ్యాంగ్ లీడర్ తమపై దాడి చేసిందంటూ పలువురు హిజ్రాలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకుని లైటర్‌తో నిప్పు అంటించుకుంటుండగా ఏడుగురికి గాయాలయ్యాయి. బోరబండ పోలీసులు(Borabanda Police), ప్రత్యక్ష సాక్షులు తెలిపిన ప్రకారం హిజ్రాల గ్యాంగ్ లీడర్ మోనాలిసా వర్గానికి, పద్మ వర్గానికి మధ్య ఇటీవల గొడవ జరిగింది.
మోనాలిసా తమపై దాడి చేయడమే కాకుండా, తమను వేధింపులకు గురి చేస్తోందని సోమవారం బోరబండ బస్టాపు వద్ద పలువురు హిజ్రాలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. దాదాపు గంటసేపు నిరసన వ్యక్తం చేసిన వారు తమతో తెచ్చుకున్న పెట్రోలు ఒంటిపై పోసుకున్నారు. లైటర్లను వెలిగించి ఆర్పుతున్న తరుణంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించి పలువురికి గాయాలయ్యాయి. గాయాలైన ఏడుగురు హిజ్రాలను మోతీనగర్‌లోని సన్‌రిడ్జ్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు.
అఫ్సానా 67 శాతం, హినా 63 శాతం, నవనీత 54 శాతం, సాయిశ్రీ మోక్షిత 42 శాతం, టీనా సునార్ 35 శాతం, ప్రాచి 18 శాతం, దివ్యశ్రీ 9 శాతం గాయాలతో ఆస్పత్రిలో చేరారు. ఎక్కువ గాయాలైన వారిని మెరుగైన చికిత్స కోసం అంబులెన్సులలో వేరే ఆస్పత్రులకు తరలించారు. సన్ రిడ్జ్ హాస్పిటల్‌కు అదనపు డీసీపీ గోవర్థన్, పంజగుట్ట ఏసీపీ మురళీకృష్ణ, పోలీస్ ఇన్‌స్పెక్టర్లు ఎం.సురేందర్, హెచ్.ప్రభాకర్, శ్రీధర్ రెడ్డి, డీఐ జి.సైదులు వచ్చి పరిస్థితిని సమీక్షించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ కార్లకు భలే డిమాండ్
Read Latest Telangana News and National News
Updated Date - Nov 18 , 2025 | 08:19 AM