Hyderabad: హత్య కేసు లింకులో మారణాయుధాల గుట్టు రట్టు
ABN, Publish Date - Dec 25 , 2025 | 08:43 AM
ఓ హత్య కేసు లింకులో మారణాయుధాల గుట్టు రట్టయింది. దాదాపు 60 మంది పోలీసులతో మొత్తం సోదాలు నిర్వహించగా పెద్దఎత్తున మారణాయుధాల బయటపడడం గమనార్హం. వాటిని చూసి పోలీసులే విస్తుపోయారంటే.. ఇక పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
- రౌడీషీటర్ జాఫర్ పహిల్వాన్, అతడి కొడుకుల ఇళ్లలో.. 60 మంది సిటీ పోలీసుల సోదాలు
హైదరాబాద్ సిటీ: ఓ రౌడీషీటర్ ఇంటి వద్దకు పోలీసులు దర్యాప్తుకెళ్లగా విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. మారణాయుధాలు బయటపడ్డాయి. దీంతో రౌడీషీటర్, అతడి కుమారులపై పోలీసులు అదనంగా కేసులు నమోదు చేశారు.
హత్య కేసు దర్యాప్తులో భాగంగా..
ఇటీవల సౌత్‌జోన్‌లో జరిగిన జునైద్ హత్య కేసులో.. 11 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. 9 మందిని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. మిగిలిన ఇద్దరు నిందితులైన కుల్సుంబేగం, రహీం గౌరి కోసం గాలిస్తుండగా రౌడీషీటర్ జాఫర్ పహిల్వాన్, అతని కుమారులకు సంబంధం ఉందని తేలింది.
ఈ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. బుధవారం తెల్లవారుజాము 60 మంది పోలీసులు రౌడీషీటర్ జాఫర్ పహిల్వాన్, అతని కుమారుల ఇళ్లలో సోదాలు చేశారు. ఈక్రమంలో 2 పెద్ద కత్తులతో పాటు ఓ గొడ్డలి, చాకులు, ఇతర మారణాయుధాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నామని డీసీపీ తెలిపారు. తాజాగా అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న మరో రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక టీమ్ రంగంలోకి దిగి గాలిస్తోందన్నారు.
అక్రమాలకు పాల్పడితే జైలుకే ..
నిర్మాణదారులను టార్గెట్ చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడినా, మామూళ్ల కోసం ఇతరులను ఎవరైనా వేధించినా ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని డీసీపీ కారే కిరణ్ ప్రభాకర్‌లిపారు. 49 మంది రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయగా 13 మంది ఆచూకీ తెలియకుండా తప్పించుకు తిరుగుతున్నారని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎల్‌వీఎం 3 ఎం6కి అనంత్ టెక్నాలజీస్ పరికరాలు
సబ్బుల్లో నంబర్ 1 బ్రాండ్‌గా సంతూర్
Read Latest Telangana News and National News
Updated Date - Dec 25 , 2025 | 08:55 AM