Hyderabad: అందమైన అమ్మాయితో డేటింగ్ కావాలా అంటూ.. రూ.6.49 లక్షలు కొట్టేశారు
ABN, Publish Date - Oct 17 , 2025 | 07:32 AM
అందమైన అమ్మాయితో డేటింగ్ అంటూ నగరానికి చెందిన యువకుడి నుంచి రూ.6.49 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. మలక్‌పేట్‌కు చెందిన యువకుడు (32) మహిళలతో స్నేహం, డేటింగ్, లివింగ్ రిలేషన్ పార్టనర్ కోసం ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లో లాగిన్ అయ్యాడు.
- యాప్‌తో వలవేసి టోకరా
- రూ.6.49 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్ సిటీ: అందమైన అమ్మాయితో డేటింగ్ అంటూ నగరానికి చెందిన యువకుడి నుంచి రూ.6.49 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. మలక్‌పేట్(Malakpet)కు చెందిన యువకుడు (32) మహిళలతో స్నేహం, డేటింగ్, లివింగ్ రిలేషన్ పార్టనర్ కోసం ఆన్‌లైన్ డేటింగ్ యాప్(Online dating app)లో లాగిన్ అయ్యాడు. వాట్సప్ కాల్ ద్వారా తన్యాశర్మ అనే పేరుతో యువతి ఫోన్ చేసింది. రూ.1950 చెల్లించి యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే పార్టనర్ దొరుకుతారని చెప్పింది. ఆమె చెప్పిన విధంగా రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు పంపాడు.
తర్వాత రితిక, ప్రీతి పేరుతో బాధితుడిని సంప్రదించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) ఒంటరిగా కలిసేందుకు ఓకే చెప్పారు. ‘మీటింగ్ కన్ఫర్మేషన్, ఎకౌంట్ వెరిఫికేషన్, హోటల్ బుకింగ్, సర్వీస్ టాక్స్, ప్రైవసీ, సెక్యూరిటీ కోసం కొంత మొత్తం చెల్లించాలి. మీరు కట్టిన డబ్బు రీఫండ్ చేస్తాం’ అంటూ పలు దఫాలుగా వేర్వేరు ఖాతాల్లో రూ.6.49లక్షల వరకు జమ చేయించుకున్నారు. ఇంకా డబ్బు డిమాండ్ చేస్తుండటంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత
Read Latest Telangana News and National News
Updated Date - Oct 17 , 2025 | 07:32 AM