ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: స్నేహితుడి గొంతుతో నేరగాళ్ల బురిడీ

ABN, Publish Date - Jun 13 , 2025 | 06:55 AM

యూకేలో ఉంటున్న స్నేహితుడిలా మాట్లాడిన సైబర్‌ నేరగాళ్లు నగరానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ.2.05 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగికి యూకేలో చదువుకుంటున్న స్నేహితుడున్నాడు.

- రూ.2.05 లక్షలు కాజేత

హైదరాబాద్‌ సిటీ: యూకేలో ఉంటున్న స్నేహితుడిలా మాట్లాడిన సైబర్‌ నేరగాళ్లు నగరానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ.2.05 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగికి యూకేలో చదువుకుంటున్న స్నేహితుడున్నాడు. గత నెల 22న +44 7961925094 నంబర్‌ నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి, యూకేలో ఉంటున్న స్నేహితుడి గొంతుతో మాట్లాడి తాను ఇండియా వస్తున్నానని చెప్పాడు. తర్వాత రోజు అదే నంబర్‌ నుంచి ఫోన్‌ చేసి తాను ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నానని, విదేశీ కరెన్సీ తెస్తున్న తనను ఎయిర్‌పోర్ట్‌లో ఇన్‌కంటాక్స్‌ అధికారులు అడ్డుకున్నారని చెప్పాడు.

తర్వాత 8132883688 నంబర్‌ నుంచి ఫోన్‌ చేసిన వ్యక్తి తాను ఇన్‌కంటాక్స్‌ అధికారి(Income Tax Officer)ని అని పరిచయం చేసుకున్నాడు. మీ స్నేహితుడు తెచ్చిన విదేశీ కరెన్సీ క్లియరెన్స్‌ కోసం రూ.55 వేలు చెల్లించాలని కోరాడు. దానికి సంబంధించిన పత్రాలు కూడా పంపాడు. ఇది నిజమని నమ్మిన బాధితుడు అతడు సూచించిన ఖాతాకు రూ.55 వేలు పంపాడు.

తర్వాత ఈ మొత్తం సరిపోదని మరో రూ.1.50లక్షలు కడితేనే ఎయిర్‌పోర్ట్‌ బయటకు పంపుతామని చెప్పడంతో మరో రూ.1.50 లక్షలు వారు సూచించిన ఖాతాకు పంపాడు. మళ్లీ రూ.3.50 లక్షలు డిమాండ్‌ చేయడంతో మోసమని గ్రహించి సైబర్‌ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ వార్తలు కూడా చదవండి.

9 నెలల్లోనే జనాభా లెక్కలు రెడీ

రోడ్డు నిర్మించకుండానే బిల్లుల మంజూరు

Read Latest Telangana News and National News

Updated Date - Jun 13 , 2025 | 06:56 AM