Population Survey: 9 నెలల్లోనే జనాభా లెక్కలు రెడీ
ABN , Publish Date - Jun 13 , 2025 | 06:20 AM
జనాభా లెక్కల ప్రక్రియ 2027 మార్చి 1న మొదలవుతుందని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అధునాతన టెక్నాలజీ సాయంతో డిసెంబరుకల్లా కొత్త లెక్కలు...
ఫారాలు పూర్తిచేయడం ఉండదు
డేటా మొత్తం ప్రత్యేక యాప్ ద్వారా సేకరణ
16 భాషల్లో ఈ యాప్ రూపకల్పన
న్యూఢిల్లీ, జూన్ 12: జనాభా లెక్కల ప్రక్రియ 2027 మార్చి 1న మొదలవుతుందని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అధునాతన టెక్నాలజీ సాయంతో డిసెంబరుకల్లా కొత్త లెక్కలు అందుబాటులోకి వచ్చేస్తాయని కేంద్రం ధీమా వ్యక్తం చేస్తోంది. గత ప్రక్రియల కంటే నవీన రీతిలో జరగబోతోందని.. డేటా సేకరణకు మొబైల్ యాప్స్, రియల్‌టైం ప్రాసెసింగ్‌కు నిఘా వ్యవస్థలను వినియోగించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జనాభా లెక్కలు మొదలైన తేదీ నుంచి జాతీయ, రాష్ట్ర, జిల్లా, తాలూకా/మండల స్థాయుల్లో లింగాలవారీ జనగణన వివరాల ప్రచురణకు 9 నెలల సమయం తీసుకునే అవకాశముందని తెలిపాయి. 2011లో చేపట్టిన జనగణనలో సదరు వివరాలు ప్రచురించేందుకు రెండేళ్లకు పైనే పట్టిందని పేర్కొన్నాయి.