ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: అరెస్ట్‌ వారెంట్‌ పేరిట వృద్ధుడిని బెదిరించి రూ.33.40 లక్షలు..

ABN, Publish Date - Aug 29 , 2025 | 08:36 AM

మీకు మానవ అక్రమరవాణా గ్యాంగుతో సంబంధాలున్నాయని, అరెస్ట్‌ వారెంట్‌ వచ్చిందని ఓ వృద్ధుడిని భయపెట్టిన సైబర్‌ నేరగాళ్లు అతని నుంచి రూ.33.40 లక్షలు వసూలు చేశారు. వివరాలిలా ఉన్నాయి. బోయినపల్లికి చెందిన వృద్ధుడి(73)కి జూలై 25న ఓ సైబర్‌ నేరగాడు ఫోన్‌ చేసి తనను తాను కర్నాటక క్రైం బ్రాంచ్‌ అధికారి గౌరవ్‌ సారథిగా పరిచయం చేసుకున్నాడు.

హైదరాబాద్‌ సిటీ: మీకు మానవ అక్రమరవాణా గ్యాంగుతో సంబంధాలున్నాయని, అరెస్ట్‌ వారెంట్‌ వచ్చిందని ఓ వృద్ధుడిని భయపెట్టిన సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) అతని నుంచి రూ.33.40 లక్షలు వసూలు చేశారు. వివరాలిలా ఉన్నాయి. బోయినపల్లికి చెందిన వృద్ధుడి(73)కి జూలై 25న ఓ సైబర్‌ నేరగాడు ఫోన్‌ చేసి తనను తాను కర్నాటక క్రైం బ్రాంచ్‌ అధికారి గౌరవ్‌ సారథి(Karnataka Crime Branch Officer Gaurav Sarathi)గా పరిచయం చేసుకున్నాడు.

మానవ అక్రమరవాణా కేసులో మీ ఆధార్‌ కార్డు ఆధారంగా బ్యాంకు ఖాతాల వినియోగం జరిగిందని, మీపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయిందని భయపెట్టాడు. అందుకు సంబంధించి నకిలీ పత్రాలు చూపి, విచారణ పూర్తయ్యే వరకు ఎవరితో మాట్లాడవద్దని ఆదేశించాడు. తర్వాత వీడియోకాల్‌లో మాట్లాడిన సైబర్‌ నేరగాడు దయానాయక్‌గా పరిచయం చేసుకుని ఫండ్‌ వెరిఫికేషన్‌ అంటూ రూ.15 లక్షలు ఆర్‌బీఐ ఖాతాలకు బదిలీ చేయాలని సూచించాడు.

తర్వాత పలు కారణాలు చూపుతూ పలుమార్లు డబ్బు బదిలీ చేయించుకున్నాడు. వెరిఫికేషన్‌ పూర్తయిన తర్వాత డబ్బు మీ ఖాతాలో జమ చేస్తామని చెబుతూ ఆగస్టు 8 వరకు పలు దఫాలుగా రూ.33.40 లక్షలు వసూలు చేశాడు. డబ్బు ఎప్పుడు రీఫండ్‌ చేస్తారని ప్రశ్నించగా, అతను స్పందించడం మానేశారు. దాంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్‌ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు.

ఈ వార్తలు కూడా చదవండి..

పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు రేట్స్ ఎలా ఉన్నాయంటే..

4 నెలల్లో రాష్ట్ర రాబడి రూ.74,955 కోట్లు

Read Latest Telangana News and National News

Updated Date - Aug 29 , 2025 | 08:36 AM