ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: చోరీ కోసం వెళ్లి చంపేశాడు..

ABN, Publish Date - May 08 , 2025 | 11:43 AM

చోరీ కోసం వెళ్లి వృద్ధదంపతుల చంపేసిన కిరాతకుడి ఉదంతమిది. నిద్రిస్తున్న వారిని సెంట్రింగ్ కొట్టి చంపి వారి మెడలో ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తకెళ్లాడు. అయితే.. ఏది ఎంతకాలం ఆగదుగా.. పాపం పండి ఎట్టకేలకు పట్టుబడ్డాడు. కాగా.. పోలీసుల విచారణలో అతగాడు చేసిన నేరాలను చూసి నివ్వెరపోవడం పోలీసుల వంతైంది. ఇక వివరాల్లోకి వెళితే...

- పాతనేరస్థుడే హంతకుడు

- వృద్ధదంపతుల హత్యను 48 గంటల్లో ఛేదించిన పోలీసులు

- నిందితుడి అరెస్టు, సొత్తు స్వాధీనం

హైదరాబాద్: వృద్ధ దంపతులను అతి కిరాతకంగా హత్యచేసిన నిందితుడిని అల్వాల్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ నెల 5న జరిగిన ఈ జంట హత్య మిస్టరీని మేడ్చల్‌ సీసీఎస్‌, ఎస్‌ఓటీ అల్వాల్‌ పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో 48 గంటల్లో ఛేదించారు. నిందితుడి అరెస్టు వివరాలను అడిషనల్‌ డీసీపీ పురుషోత్తం, పేట్‌బషీరాబాద్‌ ఏసీపీ రాములుతో కలిసి మేడ్చల్‌ జోన్‌ డీసీపీ కె.కోటిరెడ్డి పేట్‌బషీరాబాద్‌ పోలీసు స్టేషన్‌లో బుధవారం వెల్లడించారు. డీసీపీ కథనం ప్రకారం..

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: చేసేది సెకండ్‌ హ్యాండ్‌ కార్ల వ్యాపారం.. అమ్మేది అక్రమ మద్యం


అల్వాల్‌ మచ్చబొల్లారం కృష్ణానగర్‌కు చెందిన చింతకింది అనిల్‌(37) చిన్ననాటి (2003) నుంచే దొంగతనాలు చేస్తూ జువైనల్‌ హోమ్‌కు వెళ్లొచ్చాడు. అయినా అతడి ప్రవర్తనలో మార్పురాలేదు. 2016లో బొల్లారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 16 ఏళ్లపై లైంగికదాడికి పాల్పడి, హత్య చేయడంతో పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో ఇతడికి కోర్టు జీవిత ఖైదు విధించింది. కాగా, హైకోర్టు ఉత్తర్వులతో గతనెల 26న జైలు నుంచి బయటకు వచ్చాడు. మళ్లీ దొంగతనాలు చేసేందుకు సూర్యానగర్‌ కాలనీలో పలుచోట్ల రాత్రిపూట రెక్కీ నిర్వహించాడు.


పోలీసులు చూస్తే గుర్తు పడతారని ఉదయాన్నే బస్సు ఎక్కి అక్కడి నుంచి బస్టాండ్‌కు వెళ్లి పడుకొనేవాడు. ఇలా ఉండగా, ఈనెల 2వ తేదీ రాత్రి అల్వాల్‌ ప్రాంతంలో ఓ ఇంటి తాళాలు పగలగొడుతుండగా అలికిడికి ఇంట్లోవారు నిద్ర లేవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. 3వ తేదీ రాత్రి 11.30కి సూర్యానగర్‌ కాలనీలో తిరుగుతూ ఓ ఇంటికి వెళ్లి తలుపు రంధ్రం నుంచి తొంగి చూశాడు. ఇంట్లో నిద్రపోతున్న వృద్ధ దంపతులు కనిపించారు. దీంతో పక్కనే ఉన్న సెంట్రింగ్‌ కర్రతో డోర్‌ను బద్దలుకొట్టి లోపలికి వెళ్లాడు. నిద్రపోతున్న ఆలీ కనకయ్య, రాజమ్మ దంపతులను అదే కర్రతో కొట్టి చంపేశాడు.


వారి వంటిపై ఉన్న బంగారం, వెండితో పాటు ఇంట్లోని నగదు, సెల్‌ఫోన్‌ను దోచుకెళ్లాడు. మృతుల కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు హత్య జరిగిన ఇంటి నుంచి 100 కెమెరాలను జల్లిడపట్టారు. జంట హత్యలకు ముందు రోజు అదే కాలనీలో ఇంటితాళాలను పగలగొడుతున్న సన్నివేశాలు సీసీ కెమెరాల్లో కనిపించాయి. ఈ క్రమంలో అనిల్‌ను అరెస్ట్‌ చేసి విచారించగా తానే వృదదంపతులను హత్య చేసినట్టు అంగీక రించాడు. ఇతడి వద్ద నుంచి 20 వేల నగదు, 152 గ్రాముల వెండి, ఒక గ్రాము పుస్తె, ఒక గ్రాము బంగారం, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకొన్నారు.


నిందితుడిపై 29 కేసులు..

నిందితుడు అనిల్‌పై అల్వాల్‌, బొల్లారం, నర్సాపూర్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 29 కేసులు నమోదై ఉన్నాయని, వీటిలో 21 దొంగతనాలు, రెండు దోపిడీ, ఒక అత్యాచారం, హత్య కేసు, రెండు హత్యాయత్నం తదితర కేసులున్నాయన్నారు. జైల్‌ నుంచి బెయిల్‌పై వచ్చిన వారిపై పోలీస్‌ నిఘా ఉంటుందని డీసీపీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన అల్వాల్‌, ఎస్‌ఓటీ, సీసీఎస్‌ పోలీసులకు రివార్డులను అందిస్తామ న్నారు. సమావేశంలో అల్వాల్‌ సీఐ రాహుల్‌దేవ్‌, ఎస్‌ఓటీ సీఐ శ్యాం సుందర్‌రెడ్డి, డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ తిప్పప్ప, సిబంది పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. లైవ్‌లో పాక్ యాంకర్ కన్నీరు..

Operation Sindoor: 300 విమానాల రద్దు 25 విమానాశ్రయాల మూసివేత

Operation Sindoor: సిందూరమే.. సంహారమై

CM Revanth Reddy: అత్యవసర సర్వీసుల సిబ్బంది సెలవులు రద్దు

బలోచ్ లిబరేషన్ ఆర్మీ దాడి..

Read Latest Telangana News and National News

Updated Date - May 08 , 2025 | 11:43 AM