Hyderabad: చెప్పినట్లు వినకపోతే చంపేస్తా..
ABN, Publish Date - Sep 26 , 2025 | 07:00 AM
డేటింగ్ యాప్‌లో పరిచయమైన వ్యక్తి (గే) తాను చెప్పినట్లు వినకపోతే చంపేస్తానంటూ ఓ వైద్యుడిని బెదిరించాడు. ఈ సంఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసు ఇన్‌స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
- వైద్యుడికి గే బెదిరింపులు
- డేటింగ్ యాప్‌లో పరిచయం
- శారీరకంగా కలవాలని ఒత్తిడి, ఆపై దాడి
- డబ్బులు ఇవ్వాలంటూ వేధింపులు
హైదరాబాద్: డేటింగ్ యాప్‌లో పరిచయమైన వ్యక్తి (గే)తాను చెప్పినట్లు వినకపోతే చంపేస్తానంటూ ఓ వైద్యుడిని బెదిరించాడు. ఈ సంఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్(Madhapur Police Station) పరిధిలో జరిగింది. పోలీసు ఇన్‌స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. డేటింగ్ యాప్(Dating app)లో వైద్యుడితో ఓ వ్యక్తి (గే) కలిగిన తేరాల శరణ్ భగవాన్‌రెడ్డికి పరిచయం ఏర్పడింది. వారం రోజులుగా ఇద్దరూ యాప్ ద్వారా చాటింగ్ చేసుకుంటున్నారు.
అయితే, మనం కలుద్దామంటూ వైద్యుడిని ఈనెల 21న మాదాపూర్‌లోని ఓ హాస్టల్‌కు రమ్మని భగవాన్‌రెడ్డి ఆహ్వానించాడు. అక్కడికి వెళ్లిన వైద్యుడిపై భగవాన్‌రెడ్డి(Bhagavan Reddy) అనుచితంగా ప్రవర్తించాడు. అందుకు వైద్యుడు అంగీకరించలేదు. దాంతో వైద్యుడిపై అతను దాడి చేశాడు. నీ విషయం కుటుంబ సభ్యులకు, ఆస్పత్రిలో చెబుతానంటూ హెచ్చరించాడు. అంతేకాకుండా తాను చెప్పినట్టు వినకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు. దాంతో భయపడిన వైద్యుడు పేటీఎం ద్వారా రూ.5వేలు పంపించాడు.
అంతటితో సంతృప్తి చెందని అతను వైద్యుడి ఫోన్ లాక్కుని ఆస్పత్రి వరకు అతన్ని వెంబడించాడు. అతని ఫ్లాట్‌కు వెళ్లి వైద్యుడి వాలెట్లో ఉన్న రూ.3 వేలు తీసుకున్నాడు. మరిన్ని డబ్బులు ఇవ్వాలని వేధిస్తూ ఇబ్బందులకు గురిచేశాడు. బాధితుడు ఈ నెల 22న ఉమెన్ సేఫ్టీ వింగ్‌కు ఫిర్యాదు చేయగా.. వారు మాదాపూర్ పోలీసులకు కేసును బదిలీ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్..మళ్లీ తగ్గిన బంగారం, కానీ వెండి రేట్లు మాత్రం..
కాంగ్రెస్ చిల్లర వేషాలు వేస్తోంది.. ఎంపీ అర్వింద్ ఫైర్
Read Latest Telangana News and National News
Updated Date - Sep 26 , 2025 | 07:00 AM