Gold and Silver Rates Today: గుడ్ న్యూస్..మళ్లీ తగ్గిన బంగారం, కానీ వెండి రేట్లు మాత్రం..
ABN , Publish Date - Sep 26 , 2025 | 06:38 AM
బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి కీలక అలర్ట్. ఇటీవల పైపైకి చేరిన బంగారం ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుతూ, కొనుగోలుదారులకు ఊరట కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు వీటి ధరలు ఎలా ఉన్నాయి, ఎంతకు చేరుకున్నాయనే విషయాలను ఇక్కడ చూద్దాం.
దేశంలో పసిడి ప్రియులకు ఊరట కలిగించే వార్త వచ్చేసింది. ఇటీవల లక్షా 19 వేల స్థాయికి వెళ్లిన పసిడి ధరలు క్రమంగా (Gold and Silver Prices on September 26th 2025) తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఉదయం 6 గంటల సమయంలో, గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.930 తగ్గి రూ.1,14,430కి చేరింది. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం రూ.1,04,890గా ఉంది. ఇదే సమయంలో హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర నిన్నటి మాదిరిగానే రూ.1,49,900 వద్ద స్థిరంగా ఉంది. ఢిల్లీలో కేజీ వెండి రేటు రూ.1,39,900గా కలదు.
ప్రధాన నగరాల్లో 24, 22 క్యారెట్ బంగారం ధరలు
ముంబై: రూ.1,14,430, రూ. 1,04,890
చెన్నై: రూ.1,14,650, రూ. 1,05,090
కోల్‌కతా: రూ.1,14,430, రూ. 1,04,890
బెంగళూరు: రూ.1,14,430, రూ. 1,04,890
ఢిల్లీ: రూ.1,14,580, రూ. 1,05,040
హైదరాబాద్, విజయవాడలో రూ.1,14,430, రూ. 1,04,890
పూణేలో రూ.1,14,430, రూ. 1,04,890
ఈ ధరలు ముఖ్యంగా ముంబై, హైదరాబాద్, కోల్‌కతా వంటి నగరాల్లో సమానంగా ఉన్నాయి. చెన్నైలో కొంచెం ఎక్కువగా ఉంది.
ప్రధాన నగరాల్లో వెంటి ధరలు కిలోకు
వెంటి ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన నగరాల్లో వీటి రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.
హైదరాబాద్, విజయవాడ: రూ.1,49,900
ఢిల్లీ: రూ.1,39,900
ముంబై: రూ.1,39,900
చెన్నై: రూ.1,49,900
కోల్‌కతా: రూ.1,39,900
బెంగళూరు: రూ.1,39,900
పూణేలో: రూ.1,39,900
వడోదరలో: రూ.1,39,900
వెండి ధరలు దక్షిణాది నగరాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఉత్తరాదిలో తక్కువ. ఈ మార్పులు స్థానిక మార్కెట్ డిమాండ్‌పై ఆధారపడి మారుతుంటాయి. అయితే బంగారం, వెండి ధరలు ఎప్పడికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు, ఇన్వెస్ట్ చేయాలని భావించినప్పుడు వీటి రేట్ల గురించి మళ్లీ తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి