MP Arvind Fires on Congress: కాంగ్రెస్ చిల్లర వేషాలు వేస్తోంది.. ఎంపీ అర్వింద్ ఫైర్
ABN , Publish Date - Sep 23 , 2025 | 03:50 PM
కామారెడ్డిలో వరద నష్టం అంచనాపై రీ సర్వే చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపూరి అర్వింద్ సూచించారు. కామారెడ్డిలో వరద నష్టానికి ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని ఎంపీ ధర్మపూరి అర్వింద్ ప్రశ్నించారు.
నిజామాబాద్ , సెప్టెంబరు23 (ఆంధ్రజ్యోతి): కామారెడ్డి (Kamareddy) లో వరద నష్టం అంచనాపై రీ సర్వే చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపూరి అర్వింద్ (Nizamabad MP Arvind) సూచించారు. కామారెడ్డిలో వరద నష్టానికి ఒక్క పైసా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటోందని గుర్తుచేశారు. మాధవనగర్, మామిడిపల్లి, అర్సపల్లి రైల్వే బ్రిడ్జిల కోసం బీజేపీ ఉద్యమాలు చేస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా మూడు ప్రాంతాల్లో ఆందోళనలు చేయాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వరద నష్టం నిధులను ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) చిల్లర వేషాలు వేస్తోందని విమర్శించారు ఎంపీ ధర్మపూరి అర్వింద్.
ఇవాళ(మంగళవారం) నిజామాబాద్‌లో ఎంపీ ధర్మపూరి అర్వింద్ మీడియాతో మాట్లాడారు. కామారెడ్డిలో వరద నష్టం ఇవ్వకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని నిలదీశారు.కేసీఆర్ ప్రభుత్వం మాదిరిగానే చిల్లర వేషాలనూ కాంగ్రెస్ కూడా వేస్తోందని ధ్వజమెత్తారు. నిజామాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షులు, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నా పెండింగ్ పనులకు నిధులు ఎందుకు తేవడం లేదని ప్రశ్నించారు. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని.. ఆల్మట్టి పెంపుపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తేల్చుకోవాలని ఎంపీ ధర్మపూరి అర్వింద్ సవాల్ విసిరారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రెండో రోజు దుర్గమ్మ ఏ అలంకారంలో దర్శనమిస్తున్నారంటే
దానిపై వాయిదా తీర్మానం విడ్డూరం.. వైసీపీపై లోకేష్ మండిపాటు
Read Latest Telangana News And Telugu News