ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఆర్‌టీఓ చలాన్‌ పేరుతో ఏపీకే లింక్‌లు.. రూ.6.08 లక్షలు గోవిందా..

ABN, Publish Date - Sep 26 , 2025 | 08:47 AM

మీ వాహనంపై పెండింగ్‌ చలాన్లు ఉన్నాయని.. వెంటనే చెల్లించాలంటూ ఆర్‌టీఏ చలాన్‌ పేరుతో ఏపీకే లింక్‌లు పంపిన సైబర్‌ నేరగాళ్లు ఇద్దరు నగరవాసుల నుంచి రూ.6.08 లక్షలు కాజేశారు. బేగంబజార్‌కు చెందిన వ్యక్తి(50)కి వాట్సాప్‌ ద్వారా సైబర్‌ నేరగాళ్లు సందేశం పంపారు.

హైదరాబాద్‌ సిటీ: మీ వాహనంపై పెండింగ్‌ చలాన్లు ఉన్నాయని.. వెంటనే చెల్లించాలంటూ ఆర్‌టీఏ చలాన్‌ పేరుతో ఏపీకే లింక్‌లు పంపిన సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) ఇద్దరు నగరవాసుల నుంచి రూ.6.08 లక్షలు కాజేశారు. బేగంబజార్‌కు చెందిన వ్యక్తి(50)కి వాట్సాప్‌ ద్వారా సైబర్‌ నేరగాళ్లు సందేశం పంపారు. మీ వాహనంపై పెండింగ్‌ చలాన్లు ఉన్నాయని, వెంటనే చెల్లించేందుకు దిగువ ఇచ్చిన ఆర్‌టీఓ చలాన్‌ ఏపీకే లింక్‌ను క్లిక్‌ చేయాలని సూచించారు. ఇది నిజమని నమ్మిన బాధితుడు లింక్‌ తెరవగా... ఫోన్‌ను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు అతడి ఖాతా నుంచి రూ. 5.08 లక్షలు వేరే ఖాతాలకు బదిలీ చేసుకున్నారు.

మరో సంఘటనలో గడ్డిఅన్నారం(Grassland) ప్రాంతానికి చెందిన వ్యక్తి (43)కి పెండింగ్‌ చలాన్లు చెల్లించాలని, సైబర్‌ నేరగాళ్లు ఏపీకే లింక్‌ను పంపారు. లింక్‌ తెరిచిన తర్వాత ఫోన్‌ను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు అతడి ఖాతా నుంచి రూ.లక్ష వేర్వేరు ఖాతాలకు బదిలీ చేసుకున్నారు. పెండింగ్‌ చలాన్లు, కరెంట్‌ బిల్లులు చెల్లించాలంటూ సైబర్‌ నేరగాళ్లు పంపుతున్న ఏపీకే ఫైల్స్‌ను తెరవవద్దని సైబర్‌ క్రైం అధికారులు సూచిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్..మళ్లీ తగ్గిన బంగారం, కానీ వెండి రేట్లు మాత్రం..

కాంగ్రెస్ చిల్లర వేషాలు వేస్తోంది.. ఎంపీ అర్వింద్ ఫైర్

Read Latest Telangana News and National News

Updated Date - Sep 26 , 2025 | 08:47 AM