Hyderabad: వలపు వల విసిరి.. రూ.13.3 లక్షలు దోచేసి..
ABN, Publish Date - Aug 14 , 2025 | 07:13 AM
డేటింగ్ యాప్‌లో వలపు వల విసిరింది. పరిచయం పెంచుకుంది. ట్రేడింగ్‌లో టిప్స్ ఇస్తానంటూ బురిడీ కొట్టించింది. నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ. 13.3 లక్షలు కాజేసింది. సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల కథనం ప్రకారం.. బేగంపేటకు చేందిన 41 ఏళ్ల వ్యక్తికి డేటింగ్ యాప్‌లో చాందినీ చౌదరి పరిచయమైంది.
- డేటింగ్ యాప్ ద్వారా సైబర్ దోపిడీ
హైదరాబాద్ సిటీ: డేటింగ్ యాప్(Dating app)లో వలపు వల విసిరింది. పరిచయం పెంచుకుంది. ట్రేడింగ్‌లో టిప్స్ ఇస్తానంటూ బురిడీ కొట్టించింది. నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ. 13.3 లక్షలు కాజేసింది. సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల కథనం ప్రకారం.. బేగంపేటకు చేందిన 41 ఏళ్ల వ్యక్తికి డేటింగ్ యాప్‌లో చాందినీ చౌదరి(Chandni Chowdhury) పరిచయమైంది. కొద్దిరోజులు చాటింగ్ చేస్తూ వలపు వల విసిరి ముగ్గులోకి దింపింది.
అనంతరం తాను ట్రేడింగ్‌లో టిప్స్ ఇచ్చే అడ్వయిజర్‌గా చెప్పుకుంది. పెట్టుబడులకు మంచి లాభాలు వచ్చేలా చేస్తానంటూ నమ్మించింది. చిన్న మొత్తాలతో మొదలుపెట్టించి, రూ.13.3 లక్షలు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించింది. అనంతరం సైబర్ నేరగాళ్లు ఎక్కువ లాభాలు వచ్చినట్లు వర్చువల్‌గా చూపించారు.
వాటిని విత్‌డ్రా చేసుకునే వెసులుబాటును క్లోజ్ చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. మీ ఖాతా ఫ్రీజ్ అయిందని, నిబంధనల ప్రకారం కొంత పెట్టుబడులు పెట్టాలని నమ్మించారు. దీంతో ఇదంతా సైబర్ మోసమని ఆలస్యంగా గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ ధార కవిత తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పాకిస్థాన్ బెదిరింపులకు భయపడేది లేదు
బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన మంచు లక్ష్మి
Read Latest Telangana News and National News
Updated Date - Aug 14 , 2025 | 07:13 AM