Share News

Manchu Lakshmi: బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో ఈడీ విచారణకు హాజరైన మంచు లక్ష్మి

ABN , Publish Date - Aug 14 , 2025 | 05:28 AM

బెట్టింగ్‌ యాప్స్‌ కేసుకు సంబంధించి సినీ నటీ మంచు లక్ష్మి బుఽధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు.

Manchu Lakshmi: బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో ఈడీ విచారణకు హాజరైన మంచు లక్ష్మి

  • మూడున్నర గంటలు విచారించిన అధికారులు

హైదరాబాద్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): బెట్టింగ్‌ యాప్స్‌ కేసుకు సంబంధించి సినీ నటీ మంచు లక్ష్మి బుఽధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. యోలో 247 అనే బెట్టింగ్‌ యాప్‌నకు మంచు లక్ష్మి ప్రమోషన్‌ చేశారు. ఈ క్రమంలో ఆమెను ఈడీ అధికారులు విచారణలో భాగంగా ఎంత పారితోషికం తీసుకున్నారు? ఎన్నాళ్లు ప్రమోషన్‌ చేశారు వంటి వివరాలను అడిగారు. ఆమె బ్యాంకు స్టేట్‌మెంట్లను పరిశీలించి తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. దాదాపు మూడున్నర గంటలు మంచు లక్ష్మిని ఈడీ అధికారులు విచారించారు.


బెట్టింగ్‌ యాప్స్‌ కేసుకు సంబంధించి ఇప్పటికే సినీ నటులు ప్రకాశ్‌రాజ్‌, విజయ్‌ దేవరకొండ, ద గ్గుబాటి రానాలను ఈడీ అధికారులు విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు. బెట్టింగ్‌ యాప్స్‌కు ప్రమోషన్‌ చేయడం ద్వారా ఆయా నటులకు వచ్చిన పారితోషికం ఎంత? ఆ పారితోషికానికి సంబంధించిన అగ్రిమెంట్ల ప్రకారం బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లించారా? లేదా హవాలా చెల్లింపులు జరిగాయా? అనే కోణంలో ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. తెలంగాణలోని వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన ఐదు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్‌ నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

Updated Date - Aug 14 , 2025 | 05:28 AM