Asaduddin Owaisi: పాకిస్థాన్ బెదిరింపులకు భయపడేది లేదు
ABN , Publish Date - Aug 14 , 2025 | 05:32 AM
పాకిస్థాన్ బెదిరింపులకు భయపడేది లేదని, మా వద్ద బ్రహ్మోస్ క్షిపణులు ఉన్నాయని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): పాకిస్థాన్ బెదిరింపులకు భయపడేది లేదని, మా వద్ద బ్రహ్మోస్ క్షిపణులు ఉన్నాయని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. సింధు జలాల అంశంపై పాకిస్థాన్ ప్రధాని వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో స్పందించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇలాంటి బెదిరింపులకు భారత్ లొంగదని స్పష్టంచేశారు. తాను బిహార్ ప్రత్యేక ఓట్ల తనిఖీ ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’(ఎ్‌సఐఆర్) గురించి ఆందోళన చెందుతున్నట్టు పేర్కొన్నారు.
ముస్లింలు, దళితులు నిరుపేదలని.. ఓటర్ల జాబితా లో వారి పేర్లు చేర్చని పక్షంలో తర్వాత వారు దేశ పౌరులు కాదని, దేశం విడిచి పోవాలనే ఆదేశాలు రావచ్చన్నారు. ఆగస్టు 15న మాంసం దుకాణాలను మూసివేయాలనే ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని, స్వాతంత్య్ర దినం జరుపుకోవడానికి మాంసం తినడానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు.