ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: స్నేహితులతో రాత్రి 10.30 గంటల వరకు మాట్లాడి..

ABN, Publish Date - Oct 31 , 2025 | 07:41 AM

బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మైసమ్మగూడలో జరిగింది. పేట్‌బషీరాబాద్‌ సీఐ విజయవర్ధన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా, దామరచర్ల కృష్ణారావు కాలనీకి చెందిన పూర్ణచందర్‌రావు రెండో కుమారుడు పి. మల్లికార్జున్‌(19) మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఆర్‌ఐటీ)లో బీటెక్‌ తృతీయ సంవత్సరం చదువుతూ మైసమ్మగూడలోని సిరి డీలక్స్‌ వసతిగృహంలో ఉంటున్నాడు.

- బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్: బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మైసమ్మగూడలో జరిగింది. పేట్‌బషీరాబాద్‌ సీఐ విజయవర్ధన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా, దామరచర్ల కృష్ణారావు కాలనీ(Damaracherla Krishna Rao Colony)కి చెందిన పూర్ణచందర్‌రావు రెండో కుమారుడు పి. మల్లికార్జున్‌(19) మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఆర్‌ఐటీ)లో బీటెక్‌ తృతీయ సంవత్సరం చదువుతూ మైసమ్మగూడలోని సిరి డీలక్స్‌ వసతిగృహంలో ఉంటున్నాడు.

మల్లికార్జున్‌(Mallikarjun) ఈనెల 29వ తేదీ ఉదయం పరీక్ష రాసి వసతిగృహానికి వెళ్లాడు. వసతిగృహంలో ఉంటున్న జయంత్‌, సురేష్‏తోపాటు పలువురు స్నేహితులతో రాత్రి 10.30 గంటల వరకు మాట్లాడి తన గదికి వెళ్లాడు. అదేరోజు రాత్రి 11.45 గంటలకు స్నేహితులు తలుపు కొట్టగా మల్లికార్జున్‌ స్పందించలేదు. తలుపులు తీయకపోవడంతో వారు వసతిగృహం యజమానికి సమాచారం ఇచ్చారు.

తలుపులు పగులగొట్టి చూడగా మల్లికార్జున్‌ టవల్‌తో ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ ఉన్నాడు. కిందకు దించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకొని ఉంటాడని భావిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

అమ్మపాల అమృతాన్ని పంచి..

తుఫానును ఆపలేం... నష్టం తగ్గించాం

Read Latest Telangana News and National News

Updated Date - Oct 31 , 2025 | 07:41 AM