Minister Atchannaidu: తుఫానును ఆపలేం... నష్టం తగ్గించాం
ABN , Publish Date - Oct 31 , 2025 | 06:12 AM
రైతు పక్షపాతి సీఎం చంద్రబాబు. రైతుకు అండగా కూటమి ప్రభుత్వం పని చేస్తుంది అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
కృష్ణా జిల్లా పర్యటనలో మంత్రి అచ్చెన్నాయుడు
కంకిపాడు, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): ‘రైతు పక్షపాతి సీఎం చంద్రబాబు. రైతుకు అండగా కూటమి ప్రభుత్వం పని చేస్తుంది’ అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని పునాదిపాడు గ్రామంలో మొంథా తుఫాన్ కారణంగా దెబ్బ తిన్న పంట పొలాలను ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘తుఫాన్‌ను ఆపడం ఎవరి తరం కాదు. సీఎం చంద్రబాబు ముందు చూపు కారణంగా రాష్ట్రంలో మొంథా తుఫాన్ తీవ్రంగా ఉన్నప్పటికీ ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ప్రాథమిక అంచనా ప్రకారం 1.50 లక్షల హెక్టార్లలో వరి పైరు, 12,500 హెక్టార్లలో హార్టి కల్చర్ పంట నష్ట పోయింది. బాధ్యతగల మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ క్రాప్ చేయలేదంటూ పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటికే 95 శాతం ఈ క్రాప్ చేశాం’ అని అచ్చెన్న వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.