ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ananthapuram News: అయ్యప్పా.. ఎంతపని చేశావయ్యా... శబరిమలకు వెళ్లి వస్తూ టెకీ మృతి

ABN, Publish Date - Dec 25 , 2025 | 12:41 PM

శబరిమలకు వెళ్లి వస్తూ మార్గమధ్యలో నదిలో స్నానానికి దిగి ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు మృతిచెందిన విషాద సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. నందకుమార్‌ (27) అనే యువకుడు బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. అయితే.. బరిమలకు వెళ్లి వస్తూ నదిలో మునిగి చనిపోయాడు. వివరాలిలా ఉన్నాయి.

- నదిలో స్నానానికి దిగి మునిగిపోయిన యువకుడు

- ముంటిమడుగు కొత్తపల్లిలో విషాదఛాయలు

గార్లదిన్నె(అనంతపురం): అయ్యప్పస్వామి దర్శనానికి శబరిమలకు వెళ్లిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కేరళ(Kerala)లోని పెరునాడ్‌ సమీపంలో నదిలో మునిగి మృతి చెందిన సంఘటన బువారం జరిగింది. మండలంలోని ముంటిమడుగు కొత్తపల్లి గ్రామానికి చెందిన తమ్మినేని మల్లికార్జున, సరళ దంపతుల చిన్నకుమారుడు నందకుమార్‌ (27) సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా బెంగళూరు(Bengaluru)లో పని చేస్తున్నాడు. కాగా నందకుమార్‌ ఈనెల 21 తన స్నేహితులతో కలిసి బెంగళూరు నుంచి శబరిమలకు కారులో వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు.

అనంతరం శివకోయిలకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి బయలు దేరారు. మార్గమధ్యలో పేరునాడ్‌ సమీపంలో నదిలో స్నానం చేసేందుకు నందకుమార్‌ సహా స్నేహితులంతా దిగారు. అయితే ప్రమాదవశాత్తు నందకుమార్‌ నదిలో మునిగిపోయాడు. ఈతరాని నందకుమార్‌ను కాపాడేందుకు స్నేహితులు విఫలయత్నం చేశారు. అలాగే స్థానిక పోలీసులకు సమాచారం చేరవేశారు. పోలీసులు, రెస్క్యూ టీం, గజ ఈత గాళ్ల సాయంతో నందకుమార్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

చివరకు నందకుమార్‌ మృతదేహాన్ని నదిలో నుంచి బయటకు తీసి, విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కుమారుడి మరణ వార్త వినగానే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని స్థిరపడుతున్న సమయంలో దేవుడు అన్యాయం చేశాడని విలపించారు. ఆశ్రునయనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఎల్‌వీఎం 3 ఎం6కి అనంత్‌ టెక్నాలజీస్‌ పరికరాలు

సబ్బుల్లో నంబర్‌ 1 బ్రాండ్‌గా సంతూర్‌

Read Latest Telangana News and National News

Updated Date - Dec 25 , 2025 | 12:41 PM