Ananthapuram: అయ్యో ప్రమీల.. ఎంతపని చేశావమ్మా.. ఏం జరిగిందంటే..
ABN, Publish Date - Nov 18 , 2025 | 01:45 PM
ఉప్పర్లపల్లి గ్రామానికి చెందిన ప్రమీల (45) అవమానభారంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఉప్పర్లపల్లి గ్రామానికి చెందిన ముత్యాలు భార్య ప్రమీల అదే గ్రామానికి చెందిన వడ్డే నెట్టికంటికి ఐదేళ్ల కిందట రూ.20వేలు వడ్డీకి అప్పు ఇచ్చింది.
- అవమానభారంతో మహిళ ఆత్మహత్య
బత్తలపల్లి(అనంతపురం): ఉప్పర్లపల్లి గ్రామానికి చెందిన ప్రమీల (45) అవమానభారంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఉప్పర్లపల్లి(Upparlapalli) గ్రామానికి చెందిన ముత్యాలు భార్య ప్రమీల అదే గ్రామానికి చెందిన వడ్డే నెట్టికంటికి ఐదేళ్ల కిందట రూ.20వేలు వడ్డీకి అప్పు ఇచ్చింది. రెండేళ్లుగా నెట్టికంటి వడ్డీ చెల్లించలేదు. ఈ విషయమై ఇద్దరి మధ్య వివాదం ఉంది. కాగా ప్రమీల తన పొలంలో పని చేయించుకున్నందుకు కూలీలకు ఇవ్వమని తన బంధువైన పెద్దక్కకు ఆదివారం కూలీ డబ్బులు ఇచ్చింది.
అయితే పెద్దక్క కూలీలకు డబ్బులు ఇవ్వలేదు. ఈ విషయం తెలుసుకున్న ప్రమీల(Prameela) పెద్దక్కను మందలించింది. ఇది విన్న నెట్టికంటి కోడలు హేమ తమనే తిడుతోందని భావించి తమ బంధువులైన ఆదిలక్ష్మి, సుంకన్నతో కలిసి ప్రమీలతో గొడవపడింది. ఈక్రమంలోనే సుంకన్న ప్రమీలపై చేయి చేసుకున్నాడు. అంతటితో ఆగని హేమ బత్తలపల్లిలో ఉన్న వాళ్ల అమ్మకు ఫోన్ చేసి, మరో ఇద్దరిని పిలిపించి మరోసారి ప్రమీలపై దాడి చేయించింది. దీన్ని అవమానంగా భావించిన ప్రమీల తీవ్రంగా కుంగిపోయింది. ఈ క్రమంలోనే సోమవారం తెల్లవారుజామున ఇంటిలో ఫ్యానుకు ఉరి వేసుకుంది.
ఉరికి వేలాడుతున్న ప్రమీలను ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు చుట్టు పక్కలవారి సాయంతో కిందకు దించి చూడగా మృతి చెందినట్లు నిర్ధారించుకున్నారు. సీఐ రెడ్డప్ప గ్రామానికి వెళ్లి మృతికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ విషయమై కొడుకు సంజీవరాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హేమ, ఆదిలక్ష్మి, సుక్కన్న, ఓసురప్ప, రామాంజనమ్మల కేసు నమోదు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి కార్యాలయ ఇన్‌చార్జు హరీష్ బాబు, బీజేపీ నాయకులు వీరనారప్ప గ్రామానికి చేరుకొని ప్రమీల మృతదేహానికి నివాళులర్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ కార్లకు భలే డిమాండ్
Read Latest Telangana News and National News
Updated Date - Nov 18 , 2025 | 01:45 PM