ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: నిన్ను అలా చూడలేక పోతున్నా తల్లీ..

ABN, Publish Date - Oct 22 , 2025 | 01:39 PM

నల్లమాడ మండలంలోని ఎన్‌.ఎనుములవారిపల్లి గ్రామానికి చెందిన చిల్లా చిన్నగంగప్ప(54) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్న చిల్లా పెద్ద గంగప్ప తెలిపిన మేరకు... ఆరు నెలల కిందట చిన్నగంగప్ప అల్లుడు భాస్కర్‌ మృతిచెందాడు.

నల్లమాడ(అనంతపురం): నల్లమాడ మండలంలోని ఎన్‌.ఎనుములవారిపల్లి గ్రామానికి చెందిన చిల్లా చిన్నగంగప్ప(54) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్న చిల్లా పెద్ద గంగప్ప తెలిపిన మేరకు... ఆరు నెలల కిందట చిన్నగంగప్ప అల్లుడు భాస్కర్‌ మృతిచెందాడు. దీంతో చిన్న వయసులోనే తన కుమార్తెకు వైధవ్యం వచ్చిందని బాధపడుతుండేవాడు. ఈ క్రమంలో మానసికంగా తీవ్రంగా కుంగిపోయాడు. ఈ నేపథ్యంలో మంగళవారం తన పొలం వద్దకు వెళ్లి పురుగులు మందు తాగాడు.

అపస్మారక స్థితిలో ఉన్న అతడిని కొందరు బంధువులు గమనించి నల్లమాడ ప్రభుత్వ ఆసుపత్రి(Nallamada Government Hospital)కి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కదిరి(Kadiri)కి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లగా, అక్కడి వైద్యులు పరీక్షించి, మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరేంద్ర రెడ్డి తెలిపారు. మృతుడికి భార్య కళావతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్ప తగ్గుదల.. మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఆ జిల్లాలో స్కూళ్లకు సెలవు..!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 22 , 2025 | 01:39 PM