ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

EPFO: ఉద్యోగులకు EPFO గుడ్ న్యూస్.. ఈ స్కీం గడువు పొడిగింపు..

ABN, Publish Date - Jun 05 , 2025 | 08:27 PM

EPFO ELI Scheme: ఉద్యోగులకు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF) గుడ్ న్యూస్ చెప్పింది. ELI పథకం కింద ప్రయోజనాలను పొందడానికి గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

EPFO ELI Scheme UAN activation and Aadhaar deadline

EPFO UAN Activation Deadline: ఉద్యోగుల భవిష్య భద్రత కోసం రూపొందించిన ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఇప్పుడు మరింత సులభంగా, వేగంగా సేవలు అందిస్తోంది. త్వరలో మరిన్ని సదుపాయాలు కల్పించనుంది. తాజాగా ELI పథకం కింద ఉద్యోగులు అందరూ ప్రయోజనాలు పొందాలనే ఉద్దేశంతో గడువు తేదీని పొడిగిస్తున్నట్లు పేర్కొంది. EPFO తాజా ప్రకటన ప్రకారం, యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివేషన్, ఆధార్‌తో బ్యాంక్ అకౌంట్ లింక్ గడువును జూన్ 30, 2025 వరకు పొడిగించింది.


ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ELI) పథకం కింద యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివేట్ చేయడానికి, బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయడానికి EPFO ​​మరోసారి చివరి తేదీని పొడిగించింది. ELI పథకం కింద ఉద్యోగులు ప్రయోజనాలను పొందడానికి UAN యాక్టివేషన్, బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో సీడింగ్ చేయడానికి గడువు తేదీని జూన్ 30, 2025 వరకు పొడిగించినట్లు EPFO ​​తెలిపింది. దీని గురించి తెలియజేస్తూ ఇటీవల ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఇంతకుముందు చివరి తేదీ మే 31, 2025 గా ఉండేది. ఈ ప్రక్రియ ఇంకా పూర్తి చేయని ఉద్యోగులకు అదనపు సమయం ఇవ్వడం ఈ పొడిగింపు ఉద్దేశ్యం.


ELI లేదా EDLI పథకం అంటే ఏమిటి?

ఎంప్లాయీ లైఫ్ ఇన్సూరెన్స్ (ELI) పథకాన్ని అధికారికంగా ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) అని పిలుస్తారు. ఇది EPF సభ్యులకు జీవిత బీమా రక్షణ. ఈ పథకం కింద ఉద్యోగి ఉద్యోగం చేస్తున్నప్పుడు మరణిస్తే వారి నామినీకి బీమా మొత్తం ఒకేసారి లభిస్తుంది. ఈ బీమా మొత్తం గరిష్ఠంగా రూ.7 లక్షల వరకు ఉంటుంది. అయితే, UAN యాక్టివ్‌గా ఉండి.. బ్యాంక్ అకౌంట్ ఆధార్‌తో లింక్ చేసుకున్న ఉద్యోగులకు మాత్రమే ఈ పథకం కింద ప్రయోజనాలు పొందేందుకు అర్హత పొందుతారు.


UAN యాక్టివేషన్ ఎందుకు అవసరం?

EPF లేదా EDLI వంటి ప్రయోజనాలను క్లెయిమ్ చేయడానికి ముఖ్య షరతులు ఏమిటంటే.. ఉద్యోగి UAN యాక్టివ్‌గా ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఆధార్‌తో లింక్ చేయబడి ఉండాలి. EPFO ఉద్యోగి UAN యాక్టివ్ గా ఉందని ధృవీకరించాలి. సంబంధిత రికార్డులు అన్నీ సరిగ్గా అప్ డేట్ చేశారని నిర్ధారణ కావాలి. ఇలా చేయడం వల్ల కేవలం బీమా ప్రయోజనాలను మాత్రమే కాదు. పెన్షన్ (EPS), PF ఉపసంహరణ, ఇతర క్లెయిమ్‌లను సులభతరం చేస్తుంది.


UAN ని ఎవరు యాక్టివేట్ చేయాలి?

EPFO అన్ని సేవలను పొందడానికి UAN ని యాక్టివేట్ చేయడం అవసరం. ముఖ్యంగా ఆధార్ UAN తో లింక్ చేయని వ్యక్తులు ఈ విషయంలో ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఒకవేళ మీ యాజమాన్యం మిమ్మల్ని ఈ పథకంలో చేర్చి UAN ని యాక్టివేట్ చేయకపోతే మీరు వెంటనే UAN ని యాక్టివేట్ చేయాలి.


UAN ని ఎలా యాక్టివేట్ చేయాలి?

UAN యాక్టివేషన్ ప్రక్రియ ఆన్‌లైన్‌లో పూర్తిచేయడం చాలా సులభం. ఉద్యోగులు EPFO ​​సభ్యుల పోర్టల్‌ను సందర్శించడం ద్వారా కొన్ని సులభమైన దశల్లో దీన్ని పూర్తి చేయవచ్చు.


  • EPFO సైట్‌ను సందర్శించండి- https://uniedportal-mem.epndia.gov.in.

  • 'యాక్టివేట్ UAN' లింక్ పై క్లిక్ చేయండి.

  • UAN, పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.

  • మీ మొబైల్‌కు వచ్చిన OTP తో ధృవీకరించండి.

  • లాగిన్ ఆధారాలను సెటప్ చేయండి.

  • యాక్టివేషన్ పూర్తయిన తర్వాత ఉద్యోగులు తమ PF బ్యాలెన్స్, క్లెయిమ్ స్టేటస్, KYC అప్‌డేట్‌లను ఆన్‌లైన్‌లో తనిఖీ చేయవచ్చు.


ఇవి కూడా చదవండి..

ఆర్థిక నారీమణులు

అదానీ ఎయిర్‌పోర్ట్స్‌ హోల్డింగ్స్‌కు రూ 6400 కోట్ల నిధులు

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 05 , 2025 | 09:38 PM