ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Money: రోడ్డుపై డబ్బు దొరికితే మంచిదేనా..? జ్యోతిష్యం ఏం చెబుతోంది..

ABN, Publish Date - Nov 05 , 2025 | 09:51 AM

దారిలో అనుకోకుండా దొరికిన డబ్బు.. ఒక్కరూపాయి అయినా సరే అది భగవంతుడి ఆశీస్సులు మీకు ఉన్నాయని, మీ వెంట ఉన్నారని చెప్పడానికి ఇది సూచిక అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: మనం రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఎప్పుడో ఒకసారి డబ్బులు దొరుకుతుంటాయి. చాలా మంది వాటిని తీసుకుంటారు. కొందరు దొరికిన డబ్బును దానం చేస్తారు. మరికొందరు వెంటనే ఖర్చు పెడుతారు. అయితే ఇలా తీసుకోవడం వల్ల చాలా మందికి తీసుకుంటే మంచి జరుగుతుందో..? చెడు వెంటాడుతుందో.. అనే అనుమానాలు తలెత్తుతుంటాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రోడ్డు మీద డబ్బు దొరకడం అనేది శుభసూచకమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

దారిలో అనుకోకుండా దొరికిన డబ్బు.. ఒక్కరూపాయి అయినా సరే అది భగవంతుడి ఆశీస్సులు మీకు ఉన్నాయని, మీ వెంట ఉన్నారని చెప్పడానికి ఇది సూచిక అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. దొరికిన ఈ డబ్బును ఇతరులకు దానం చేయకూడదు కూడా. ఒక రూపాయి, ఐదు రూపాయలు లేదా పది రూపాయల నాణెం దొరికితే, దాన్ని దైవశక్తికి ప్రతీకగా భావించాలని అంటున్నారు..

రోడ్డుపై నోటు దొరికితే, లక్ష్మీదేవి అపారమైన అనుగ్రహం మీపై ఉండబోతుందని అర్థం. దాన్ని పర్సులో భద్రంగా ఉంచుకోవాలి. మీకు ఏ సమయంలో డబ్బు దొరికింది అనే దానిపై కూడా వివిధ సంకేతాలు ఆధారపడి ఉంటాయి. ఉదయం ఇంట్లో నుండి బయలుదేరిన తర్వాత డబ్బు దొరికితే, మీ దశ తిరిగిందని అర్థం. కొందరికి నాణెం లేదా నోటు కాకుండా, డబ్బుతో నిండిన పర్సు కూడా దొరుకుతుంది. అలాంటి వారికి చాలా వారసత్వ సంపద లభించే అవకాశాలు ఉన్నాయని సంకేతమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

రోడ్డుపై దొరికిన నాణెం మీరు త్వరలో కొత్త పనిని ప్రారంభించబోతున్నారని సూచిస్తుంది. ఈ పని మీకు విజయాన్ని, ఆర్థిక లాభాలను రెండింటినీ అందిస్తుంది. ఈ ప్రయత్నంలో మీకు పదోన్నతి కూడా లభించే అవకాశం ఉంది. నాణేలు లోహంతో తయారవుతాయి, లోహం దైవశక్తికి ప్రతీక. నాణెం దొరికితే, దేవి అనుగ్రహం మీపై ఉండబోతుందని అర్థం. నాణెం దొరకడం అంటే మీ పురోగమనానికి చిహ్నం.

ఒకవేళ డబ్బుతో నిండిన పర్సు మీకు దొరికితే, త్వరలో మీ జీవితంలో శుభం జరుగుతుందని సంకేతమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. వంశపారంపర్యంగా వచ్చే ఆస్తి లభించే అవకాశం కూడా దీని ద్వారా ఉంటుందని చెబుతున్నారు. అందుకే ఆ డబ్బును భద్రంగా ఉంచుకోవడం ముఖ్యమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

Also Read:

నేడు కార్తీక పౌర్ణమి.. ఈ పనులు చేస్తే లక్ష్మీ కటాక్షమే..

గుడ్ న్యూస్.. మరింతగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Updated Date - Nov 05 , 2025 | 10:02 AM