ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

GVMC Dy Mayor: డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా.. లోకేశ్ సీరియస్

ABN, Publish Date - May 19 , 2025 | 03:11 PM

GVMC Dy Mayor: జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడడంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ సీరియస్ అయ్యారు.

విశాఖపట్నం, మే 19: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)లో తమకు కావాల్సినంత సంఖ్య బలం ఉందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. జీవీఎంసీలో డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. ఈ నేపథ్యంలో సోమవారం విశాఖపట్నంలో పల్లా శ్రీనివాస రావు మాట్లాడుతూ.. నిన్నటి వరకు.. డిప్యూటీ మేయర్ అభ్యర్థి ఎంపిక విషయంలో నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం కావడానికి ఒక కారణం ఉందన్నారు. గత రాత్రి 11.00 గంటలకు ఆ పదవి జనసేన పార్టీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే ఆ పదవి కోసం టీడీపీలో ఆశావాహులున్న మాట వాస్తవమని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇక ఈ ఎన్నిక వాయిదా పడడానికి కోఆర్డినేషన్ సమస్య కూడా ఒక కారణమన్నారు. అందుకే ఈ ఇబ్బంది వచ్చిందని ఆయన తెలిపారు. జీవీఎంసీ కౌన్సిల్‌కు సభ్యులంతా వస్తారని తాము ధీమాతో ఉన్నామన్నారు. దీనికి తాను పూర్తి బాధ్యత వహిస్తానని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.


మరోవైపు.. విశాఖపట్నంలో నేడు జరగాల్సిన డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడడం.. అందుకు పార్టీ కార్పొరేటర్లు గైర్హాజరు కారణం కావడంపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. ఈ ఎన్నికకు గైర్హాజరైన వారికి నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర నాయకత్వానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆదేశించారు. కొందరిపై చర్యలకు వెనకాడ వద్దని ఈ సందర్భంగా రాష్ట్ర నాయకత్వానికి ఆయన కీలక సూచన చేశారు. మరోసారి ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.


విశాఖపట్నం డిప్యూటీ మేయర్ ఎన్నిక ఈ రోజు జరగాల్సి ఉంది. కానీ కౌన్సిల్‌లో సభ్యులు మొత్తం 74 మంది ఉంటే.. 54 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ డిప్యూటీ మేయర్ ఎన్నికకు 56 మంది సభ్యులు అవసరమవుతారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికను మంగళవారం నిర్వహించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇంకోవైపు ఈ డిప్యూటీ మేయర్ ఎన్నికకు కౌన్సిల్ సభ్యులంతా హాజరు కావాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

TTD: టీటీడీలో మరో స్కామ్ వెలికి తీసిన బీజేపీ నేత

Lashkar e Taiba: భారత్ వ్యతిరేకులకు.. వైట్ హౌస్‌లో కీలక పదవులు

Kadiri Municipality: కదిరి మున్సిపల్ చైర్ పర్సన్‌గా దిల్షాద్ ఉన్నీసా

Vizianagaram: బాంబు పేలుళ్ల కుట్ర భగ్నం.. వెలుగులోకి సంచలన విషయాలు

GVMC Dy Mayor: జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా.. ఎందుకంటే..

For Andhrapradesh News And Telugu News

Updated Date - May 19 , 2025 | 03:11 PM