Share News

Kadiri Municipality: కదిరి మున్సిపల్ చైర్ పర్సన్‌గా దిల్షాద్ ఉన్నీసా

ABN , Publish Date - May 19 , 2025 | 11:36 AM

Kadiri Municipality: శ్రీసత్యసాయి జిల్లాలోని కదిరి మున్సిపల్ చైర్మన్‌గా దిల్షాద్ ఉన్నీసా ఎన్నికయ్యారు. అలాగే వైస్ చైర్మన్లుగా సైతం కూటమిలోని పార్టీ నేతలే ఎన్నికయ్యారు. వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Kadiri Municipality: కదిరి మున్సిపల్ చైర్ పర్సన్‌గా దిల్షాద్ ఉన్నీసా

పుట్టపర్తి, మే 19: శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి మున్సిపాలిటీ టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్ పర్సన్‌గా దిల్షా దున్నీషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే వైస్ చైర్మన్లుగా సుధారాణి, రాజశేఖర్ ఆచారి సైతం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో మున్సిపల్ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు, కార్యకర్తలు బాణా సంచా పేలుస్తూ.. సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ ఎన్నికను వైసీపీ బహిష్కరించింది.

ఇక ఈ ఎన్నిక ఏకగ్రీవం కావడానికి స్థానిక ఎమ్మెల్యే కందికొండ చేసిన ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి. బెంగళూరు క్యాంప్‌లో ఉన్న టీడీపీ కౌన్సిలర్లు.. సోమవారం ఉదయం మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్‌ ఎన్నిక.. అనంతరం వైస్ చైర్మన్ల ఎంపిక ఏకగ్రీవమైంది. కదిరి మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉన్నాయి. అయితే వాటిలో టీడీపీకి 25 మంది, వైసీపీకి 11 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలోని మున్సిపాలిటీల చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు, అలాగే విశాఖపట్నం నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక‌తోపాటు మేజర్ పంచాయతీ చైర్మన్ పోస్ట్‌కు ఈ రోజు ఎన్నిక నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Updated Date - May 19 , 2025 | 11:50 AM